భీమ్లాకు హిందీలో పెద్ద‌ ఫిగ‌ర్స్ క‌ష్టం?

Update: 2022-02-20 06:01 GMT
పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అనేది ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారుతోంది. బాహుబ‌లి ముందు బాహుబ‌లి త‌ర్వాత‌! స‌న్నివేశం మారింది. అందుకే మ‌న హీరోలంతా పాన్ ఇండియా స్టార్ డమ్ ని అందిపుచ్చుకునేందుకు క‌థ‌ల్ని ఎంచుకునే విధానంలో అప్ డేట్ అయ్యారు.

యూనివ‌ర్శ‌ల్ కంటెంట్ ఉన్న సినిమాల‌తో ఇరుగు పొరుగు బాక్సాఫీసుల్ని షేక్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. పొరుగున త‌మ‌కు మంచి మార్కెట్ క్రియేట్ చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇప్పుడు అదే దారిలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా తాను న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే భీమ్లాకు తెలుగు రాష్ట్రాల్లో కుదిరిన‌ట్టు హిందీ ఆడియెన్ లో కుదురుతుందా? అంత క్రేజీగా భీమ్లా నాయ‌క్ వ‌సూళ్లు తేగ‌ల‌డా? అంటూ చ‌ర్చ సాగుతోంది.

భీమ్లా హిందీలో పెద్ద ఫిగ‌ర్స్ తేవ‌డం క‌ష్టం. పైగా అక్క‌డ ప్ర‌మోష‌న్స్ కూడా జీరో. ఇక్క‌డ ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రేజ్ ప‌నికొస్తుంది కానీ హిందీలో కాదు క‌దా!  బాలీవుడ్ లో ప‌వ‌న్ ఎవ‌రో ఇప్ప‌టివ‌ర‌కూ పెద్ద‌గా తెలియ‌దు.

అత‌డు పాన్ ఇండియా ప్ర‌య‌త్నాలు ఇంత‌కుముందు చేయ‌లేదు అన్న‌ది వాస్త‌వం. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద రాణించేందుకు భీమ్లా నాయ‌క్ ప‌నికొస్తుందా? అన్న‌ది వేచి చూడాలి.

ఈ మూవీ త‌ర‌వాత ప‌వ‌న్ కి `హ‌రి హ‌ర వీర మ‌ల్లు` పాన్ ఇండియా కేట‌గిరీలో రూపొందుతున్న సినిమా. ఆ త‌ర్వాత ప‌వ‌న్ స‌న్నివేశం హిందీ ఆడియెన్ లో మారుతుందేమో చూడాలి. బాహుబ‌లి త‌ర్వాత పుష్ప చిత్రం తెలుగు వాడి స‌త్తా ఏంటో హిందీ ఆడియెన్ కి చూపించింది.

అందువ‌ల్ల నెమ్మ‌దిగా ఉత్త‌రాది జ‌నాల మైండ్ సెట్ మారుతోంది. ఇది ప‌వ‌న్ స‌హా ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేసే మ‌న స్టార్ల‌కు క‌లిసొస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ తో చ‌రణ్ - తార‌క్ కూడా పాన్ ఇండియా రేసులోకి వ‌చ్చేసిన‌ట్టే.

భీమ్లా నాయ‌క్ ఈ నెల 25న విడుద‌ల‌వుతుండ‌గా..వ‌రుణ్ తేజ్ న‌టించిన గ‌ని చిత్రం వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. రెండు వారాల పాటు ప‌వ‌న్ మానియా  బాక్సాఫీస్ వద్ద సాగితే కానీ పెట్టిన పెట్టుబ‌డులు రిక‌వ‌రీ చేయ‌డం సాధ్య‌ప‌డ‌దు.

ఈ విష‌యంలో ఎవ‌రి సందేహాలు వారికి ఉన్నాయి. ఇక పాన్ ఇండియా రిలీజ్ అనేది సితార బ్యాన‌ర్ కి పెద్ద టాస్క్ అన‌డంలో సందేహం లేదు.
Tags:    

Similar News