భీమ్లాను హిందీలో ప్రమోట్ చేయడం లేదేంటి..?
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ''భీమ్లా నాయక్''. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగుతో పాటుగా హిందీలోనూ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే ప్రీమియర్స్ కు మరో మూడు రోజులే ఉన్నా.. ఇంతవరకు బాలీవుడ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. 'భీమ్లా నాయక్' విడుదల తేదీని హడావిడిగా అనౌన్స్ చేసినా.. మేకర్స్ ప్రచార కార్యక్రమాలు జోరుగానే చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ అంతా వదిలేయడంతో.. స్పెషల్ పోస్టర్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మిగిలిన థియేట్రికల్ ట్రైలర్ ను కూడా సోమవారం రాత్రి రిలీజ్ చేశారు.
కానీ ఇప్పటి దాకా హిందీ వెర్సన్ కు సంబంధించిన ఒక పోస్టర్ కూడా వదల్లేదు. విడుదల తేదీ దగ్గరకు వచ్చినా భీమ్లా ను నార్త్ బెల్ట్ లో ప్రమోట్ చేయకపోవడం అభిమానులను కలవర పెడుతోంది. హిందీలో రిలీజ్ చేస్తామని చెప్పారే కానీ.. ఒక లిరికల్ వీడియోనో లేదా ఒక స్పెషల్ పోస్టర్ అయినా ఎందుకు వదల్లేదని అందరూ ఆలోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' హిందీ వెర్సన్ ను ఓ వారం తరువాత విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా పబ్లిసిటీ చేయాలని చూస్తున్నారట. ఇటీవల కాలంలో కొన్ని తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేయబడి థియేట్రికల్ రిలీజ్ చేయబడ్డాయి. వాటిల్లో కొన్ని ప్రమోషన్స్ చేయకపోయినా ఉత్తరాది ఆడియన్స్ కు రీచ్ అయ్యాయి.. మరికొన్ని తీవ్రంగా నిరాశ పరిచాయి.
'పుష్ప: ది రైజ్' చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయగా.. దాదాపు 100 కోట్ల వరకు రాబట్టింది. థియేట్రికల్ రిలీజ్ అవుతుందా? లేదా యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుందా? అనే సందేహాల మధ్య చివరికి థియేటర్లలో విడుదలై మంచి వసూళ్ళు అందుకుంది. ముందు నుంచే హిందీకి స్పెషల్ గా పోస్టర్స్ - లిరికల్ సాంగ్స్ వదలడం ఈ సినిమాకు కలిసొచ్చింది.
పుష్ప వసూళ్ళు చూసి 'ఖిలాడి' సినిమాని కూడా ఇటీవల హిందీలో రిలీజ్ చేశారు. ముందు నుంచీ ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ వదలకుండా.. ఉన్నట్టుండి హిందీ అని థియేట్రికల్ ట్రైలర్ వదిలారు. ఈ సినిమా బాలీవుడ్ లో డిజాస్టర్ అయింది. ఈ క్రమంలో ఇప్పుడు 'భీమ్లా నాయక్' సినిమా నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేసింది.
ఇది 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' అనే మలయాళ సినిమాకి అధికారిక తెలుగు రీమేక్. ప్రస్తుతం ఒరిగినల్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండటంతో చాలా వరకు అందరూ చూసేశారు. కాకపోతే ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే.. ఇది పవన్ కళ్యాణ్ సోలో సినిమా అనుకునేలా మార్పులు చేర్పులు చేసినట్లు క్లారిటీ వచ్చేసింది. ఎంత పవన్ సినిమా అయినా నార్త్ లో గట్టుగా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది.
అందులోనూ గతంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాతో పవన్ కళ్యాణ్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అప్పటి నుంచి హిందీ మార్కెట్ కు దూరంగా ఉన్న పవన్.. ఇప్పుడు అందరు హీరోలు బాలీవుడ్ అంటున్న తరుణంలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోడానికి సిద్ధమయ్యారు. మరి ఈ రీమేక్ 'భీమ్లా నాయక్' ఉత్తరాది జనాలను ఏ మేరకు అలరిస్తుందేమో చూడాలి.
కాగా, 'భీమ్లా నాయక్' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. థమన్ సంగీతం సమకూర్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు.