భీమ్లా స‌డ‌న్ ఎంట్రీకి కార‌ణం వారేనా?

Update: 2022-02-17 15:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ణ్ క‌ల్యాణ్ `భీమ్లా నాయ‌క్` రిలీజ్ డేట్ ప్ర‌క‌టించేశారు. అయితే దీని వెన‌క పెద్ద స్టోరే వుంద‌ని తెలుస్తోంది. స‌డ‌న్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేక‌ర్స్ ఫైన‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. ముందు ఈ డేట్ కి సినిమా వ‌స్తుందా రాదా అని ఇత‌ర సినిమాల రిలీజ్ ల‌ని హోల్డ్ లో పెట్టిన మేక‌ర్స్ స‌డ‌న్ గా భీమ్లా ఎంట్రీ ఖ‌రారు కావ‌డంతో ఒక్క‌సారిగా షాక‌య్యారు.

ఇండస్ట్రీ వ‌ర్గాల్లో భీమ్లా రిలీజ్ డేట్ పై వినిపిస‌క్తున్న ఓ వెర్ష‌న్ ఏంటంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒత్తిడి కార‌ణంగానే మేర‌ర్స్ రిలీజ్ డేట్ ని హ‌డావిడిగా ప్ర‌క‌టించార‌ని వార్తుల వినిపిస్తున్నాయి.

టికెట్ రేట్ల‌కు సంబంధించిన జీవో.. 100 శాతం థియేట‌ర్ల ఆక్యుపెన్సీ కి సంబంధించిన ఉత్త‌ర్వుల‌తో సంబంధం లేకుండా ఒక వేళ అలాంటి ఉత్త‌ర్వులు వ‌చ్చినా రాక‌పోయినా సినిమాని ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేయాల్సిందేన‌ని ప‌వ‌న్ ప‌ట్టుబ‌ట్టార‌ట‌.

దాంతో మేక‌ర్స్ రిలీజ్ డేట్ ని హ‌డావిడిగా ప్ర‌క‌టించేశార‌ని చెబుతున్నారు. అయితే అంతులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, `భీమ్లా నాయ‌క్‌` ఆల్ ఆఫ్ స‌డ‌న్ గా బ‌రిలోకి దిగ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వేరే వుంద‌ని తెలుస్తోంది.

ఈ మూవీ రిలీజ్ వెన‌క బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ వుంద‌ని తాజాగా ఓ వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. భీమ్లా చిత్ర హిందీ వెర్ష‌న్ డ‌బ్బింగ్ హ‌క్కుల్ని B4U సంస్థ‌తో క‌లిసి పెన్ స్టూడియోస్ సొంతం చేసుకుంది.

ఈ సంస్థ చేతిలో ఉత్త‌రాదిలో భారీ స్థాయిలో థియేట‌ర్లు వున్నాయ‌ట‌. అంతే కాకుండా ఈ సంస్థ `గంగూబాయి క‌తియావాడీ` - ఆర్ ఆర్ ఆర్ - షాహీద్ క‌పూర్ హీరోగా న‌టించిన `జెర్సీ` , మెగాస్టార్ `ఆచార్య‌` చిత్రాల‌ని రిలీజ్ చేస్తున్నారు.

ఇందులో అలియా భ‌ట్ న‌టించిన `గంగూబాయి క‌తియావాడీ` ఈ నెల 25న విడుద‌ల కాబోతోంది. అలాగే రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `ఆర్ ఆర్ ఆర్‌` మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

షాహీద్ క‌పూర్ `జెర్సీ` ఏప్రిల్ 14న వ‌చ్చేస్తోంది. మెగాస్టార్ `ఆచార్య‌` ఏప్రిల్ 28న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ రేంజ్ భారీ లైన‌ప్ వుండ‌టం.. ఈ చిత్రాల‌ని ఇదే సంస్థ రిలీజ్ చేస్తుండ‌టంతో `భీమ్లానాయ‌క్‌` ని ఫిబ్ర‌వ‌రి 25నే విడుద‌ల చేయాల‌ని ప‌ట్టుప‌ట్టిందంట‌.

ఈ డేట్ మారితే మిగ‌తా చిత్రాల‌తో క్లాష్ వుంటుంద‌ని, అది త‌మ‌కు ప్ర‌మాద‌మ‌ని గ‌ట్టిగా వాదించి మొత్తానికి రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించేలా చేసింద‌ని చెబుతున్నారు.

`పుష్ప‌` రిజ‌ల్ట్‌ని దృష్టిలో పెట్టుకుని `భీమ్లా నాయ‌క్‌` కు ఉత్త‌రాదిలో భారీ ఓపెసెనింగ్స్ ల‌భించే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. పెన్ స్టూడియోస్ తాజా నిర్ణ‌యం కార‌ణంగా శ‌ర్వానంద్ `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు`, వ‌రుణ్ తేజ్ `గని` చిత్రాల‌కు బిగ్ షాక్ త‌గిలింది. 
Tags:    

Similar News