పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ హిట్ సాధించిన ఆ సినిమాలోని కాటమరాయుడ కదిరి నరసింహుడ సినిమా కూడా అంతే విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ పాట అంతగా హిట్ అవ్వడంకు కారణం పవన్ పాడటం అనే విషయం తెల్సిందే. పవన్ పాడిన పలు పాటల్లో ఆ పాట ను ఆయన అభిమానులు ఎప్పటికి మర్చిపోరు. ఆయన పాటలు మళ్లీ మళ్లీ వినాలని అభిమానులు కోరుకుంటూనే ఉంటారు. తాజాగా భీమ్లా నాయక్ సినిమా కోసం కూడా పవన్ ఒక పాటను పాడాడు అనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్ స్వయంగా పట్టుబట్టి ఈ పాటను పవన్ తో పాడించాడనే వార్తలు వస్తున్నాయి. ఆ పాటను కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారట.
ఇప్పటికే భీమ్లా నాయక్ నుండి పాటలు బ్యాక్ టు బ్యాక్ అన్ని విడుదల చేసేశారు. సంక్రాంతికి సినిమా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో పాటల విడుదల విషయంలో ఆగకుండా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు న్యూయర్ కు పవన్ పాడిన బిట్ సాంగ్ ను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారనే వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదలకు ఇంకా ఎక్కువ సమయం ఉన్న కారణంగా విడుదల చేసే విషయమై చాలా ఆలోచనలు చేశారట. చివరకు కొత్త సంవత్సరంకు భీమ్లా నాయక్ నుండి ఏదైనా స్పెషల్ ఉండాలనే ఉద్దేశ్యంతో విడుదల చేసేందుకు సిద్దం అయ్యారనే వార్తలు వస్తున్నాయి. భీమ్లా నాయక్ సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వడంతో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి మొదటి వారం వరకు ఫస్ట్ కాపీ సిద్దం అవుతుందని అంటున్నారు.
భీమ్లా నాయక్ కు సంగీతాన్ని థమన్ అందిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు థమన్ పలువురు హీరోలతో పాటలు పాడించాడు. ఈ పాట కూడా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా భీమ్లా నాయక్ నిలుస్తుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. మలయాళం హిట్ మూవీకి రీమేక్ అయినా కూడా పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లేను మార్చారట. కమర్షియల్ గా ఈ సినిమా ను రూపొందించినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. పవన్ కు జోడీగా ఈ సినిమా లో నిత్యా మీనన్ నటించగా.. కీలక పాత్రలో రానా నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాకు రచన సహకారం పూర్తిగా త్రివిక్రమ్ అందించాడు. కనుక ఇది పవన్.. త్రివిక్రమ్ ల మూవీ అన్నట్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తో దర్శకుడు సాగర్ చంద్ర కూడా మంచి గుర్తింపు దక్కించుకుంటాడని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.