పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా పెద్ద సినిమాలకు సైడ్ ఇచ్చే ఉద్దేశ్యంతో వాయిదా వేయడం జరిగింది. పెద్ద సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల అవ్వలేదు అది వేరే విషయం.
ఈ సినిమాను ఫిబ్రవరి 25వ తారీకున విడుదల చేసేందుకు ఇప్పటికే డేట్ ను ఖరారు చేశారు. సినిమాను ఆ తేదీన విడుదల చేయక పోవచ్చు అనేది ఇప్పటికి కొందరు అనుకుంటున్నారు. ఎందుకంటే కరోనా కేసులు ఫిబ్రవరిలో పీక్స్ లో ఉంటాయని అంటున్నారు. కరోనా కేసులు ఒక వేళ తగ్గి పరిస్థితులు కుదుట పడితే అప్పుడు భీమ్లా నాయక్ సినిమా ను అనుకున్న తేదీకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
భీమ్లా నాయక్ సినిమా విడుదల విషయంలో గందరగోళం నెలకొన్న ఈ సమయంలో రన్ టైమ్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమా ను మొదటి పావు తక్కువ మూడు గంటల నిడివితో విడుదల చేయాలని భావించారని.. కాని ఎంత తక్కువ సమయం ఉంటే అంత మంచిది అనే ఉద్దేశ్యంతో సినిమాను దాదాపుగా 30 నిమిషాలు కట్ చేసి రెండు పావు గంటల నిడివితో మాత్రమే సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా 2 గంటల 15 నిమిషాల వరకు ఉండేలా ఎడిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాన్ అభిమానులు ఈ పుకార్లతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఇద్దరు హీరోలు.. పైగా ఈ సినిమా రీమేక్ కనుక పవన్ కళ్యాణ్ ఎలివేషన్ కు ఛాన్స్ ఎక్కువగా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా అంటే మినిమంగా రెండున్నర గంటలు అయినా ఉండాలి.. కాని రెండు పావు గంటలు మరియు రానా కూడా ఈ సినిమాలో కనిపించబోతున్న నేపథ్యంలో పవన్ స్క్రీన్ స్పేస్ మరియు టైమ్ తగ్గుతుందేమో అంటూ నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ అభిమానులు ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
భీమ్లా నాయక్ లో పవన్ ను ఫుల్ మాస్ లుక్ లో చూడబోతున్నాం కనుక ఆయన హీరోయిజం ఎలివేట్ సీన్స్ ను లెక్కకు మించి దర్శకుడు చూపిస్తాడని ఆశిస్తూ ఉంటే ఇలా నిడివి తగ్గించడం ద్వారా అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే విషయంలో అభిమానులు టెన్షన్ తో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుండి ఎలాంటి అఫిషియల్ క్లారిటీ మాత్రం లేదు.