భీమ్లానాయ‌క్ కి UA .. ఇక టికెట్ పెంపు పెండింగ్!

Update: 2022-02-18 14:27 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - రానా ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించిన భీమ్లా నాయ‌క్ ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే మూవీ ప్ర‌మోష‌న్స్ ని పీక్స్ కి తీసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ బృందం యుఏ స‌ర్టిఫికెట్ అందించి కంటెంట్ పై ప్ర‌శంస‌లు కురిపించింద‌ని స‌మాచారం. ఇక రిలీజ్ కి వారం రోజులే స‌మ‌యం ఉంది. భీమ్లా త‌మ బ్యాన‌ర్ కి మ‌రో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని అందిస్తాడ‌ని సితార బ్యాన‌ర్ భావిస్తోంది.

ఇప్ప‌టికే ఇంటా బ‌య‌టా బిజినెస్ అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే.  భీమ్లా నాయక్ USA ప్రీ-రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. అలాగే క‌లెక్ష‌న్ల ప‌రంగా రికార్డులు ఖాయంగా క‌నిపిస్తోంది.

 ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం అమెరికా ప్రీమియర్ ల ప్రీ-బుకింగ్ లు USD 100 కె మార్క్ ను దాటాయి. షెడ్యూల్ చేసిన ప్రీమియర్ లకు వారం ముందు కూడా ఇంత‌. COVID-19 తర్వాత USలో ఏ భారతీయ సినిమాకైనా (హిందీ చిత్రాలతో సహా) ఇదే అత్యధిక కలెక్షన్ రేంజ్ అన తెలిసింది.

మునుముందు భీమ్లా నాయక్ మరింతగా వ‌సూళ్ల రికార్డుల‌ను సృష్టించడానికి స‌రి కొత్త రికార్డులను అందుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ డమ్ తో పాటు.. రానా దగ్గుబాటి ఎన‌ర్జీ భీమ్లా నాయక్  క్రేజ్ ను పెంచింది.

సెన్సార్ పూర్త‌యింది స‌రే.. ఏపీలో టికెట్ రేట్లు పెరిగేదెలా? .. ఇన్నాళ్లు వేచి చూసింది దీనికోస‌మే. కానీ ఏపీ ప్ర‌భుత్వంలో ఏ మార్పు క‌నిపించ‌లేదు. అందుకే ఇక లాభం లేద‌నుకుని సినిమాని రిలీజ్ చేస్తున్నార‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది.

త‌దుప‌రి ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ నుంచి పోటీ అన‌వ‌స‌రం. అది కూడా ఒక కార‌ణం. అయితే ప‌వ‌ర్ స్టార్ మానియా వ‌ర్క‌వుట్ అయ్యేందుకు ఇప్పుడు అవ‌కాశం కూడా ఉంది. ఇత‌ర క్రేజీ సినిమాలేవీ రిలీజ్ కి లేవు కాబ‌ట్టి భీమ్లా నాయ‌క్ కి అది ప్ల‌స్ అవుతుందేమో చూడాలి.

భీమ్లా నాయక్ అమెరికా- కెనడాలో భారీ ప్లాన్

భీమ్లా నాయక్ పాపుల‌ర్ మలయాళ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్. ఇది ఇప్పటికే చాలా మంది USA ప్రేక్షకులకు సుపరిచితమైన టైటిల్. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించ‌గా.. త్రివిక్ర‌మ్ ప‌ర్య‌వేక్షించారు. ఆయ‌నే మాట‌లు అందించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయాలని భావించినా.. ఆర్ ఆర్ ఆర్‌ నిర్మాతల అభ్యర్థన మేరకు వాయిదా పడింది. ఇప్పుడు పెద్ద సినిమాల విడుదలల రీషెడ్యూల్ తర్వాత ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అమెరికాలో ఇది ఫిబ్రవరి 24న ప్రీమియ‌ర్ల‌తో ప్రదర్శితం కానుంది. ప్రైమ్ మీడియా దీనిని USలో విడుదల చేస్తోంది. భీమ్లా నాయక్ కోవిడ్-19 తర్వాత ఇప్పటివరకు భారతీయ చలనచిత్రంలో అతిపెద్ద విడుదల కానుంది.
Tags:    

Similar News