RRR పై భీమ్లా - రాధేశ్యామ్ ఎఫెక్ట్..?

Update: 2022-03-25 01:30 GMT
కరోనా థర్డ్ వేవ్ పాండమిక్ తర్వాత ఎప్పటిలాగే సినిమాల హడావిడి మొదలైంది. ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన క్రేజీ చిత్రాలన్నీ ఒక్కటొక్కటిగా థియేటర్లలోకి వస్తున్నాయి. తెలుగులో ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన పెద్ద సినిమాలు 'భీమ్లా నాయక్' & 'రాధేశ్యామ్'. తమిళ్ లో 'వాలిమై' - 'ఈటీ' వంటి చిత్రాలు వచ్చాయి.

పవన్ కళ్యాణ్ - ప్రభాస్ - అజిత్ - సూర్య వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు కావడంతో భారీ రేట్లకు అమ్ముడయ్యాయి. అయితే ఈ చిత్రాలు అంచనాలు అందుకోలేకపోయాయి. భీమ్లా టాక్ బాగున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.

మరోవైపు 'రాధేశ్యామ్' సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకొని డిజాస్టర్ గా నిలిచింది. రెవెన్యూలు లేకపోవడంతో ఎగ్జిబిటర్స్ తో పాటుగా బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి 'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై పడింది.

ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా RRR చిత్రాన్ని తెరకెక్కించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్ థియేటర్లోకి రాబోతోంది.

'బాహుబలి' తర్వాత జక్కన్న నుంచి వస్తోన్న సినిమా కావడంతో అన్ని ఏరియాలలో 'ఆర్.ఆర్.ఆర్' కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో అప్పుడెప్పుడో అధిక రేట్లు చెల్లించి సినిమాను కొనుక్కున్నారు. అయితే ఇటీవల వచ్చిన సినిమాలు నష్టాలు మిగల్చడంతో ఇప్పుడు RRR ఎగ్జిబిటర్స్ - బయ్యర్లు కాస్త కలవరపడుతున్నారని తెలుస్తోంది.

ఇటీవల 'భీమ్లా నాయక్' మరియు 'రాధేశ్యామ్' వంటి చాలా సినిమాలకు ఆశించిన స్థాయిలో రెవెన్యూ లేకపోవడంతో.. ఇప్పుడు RRR కొనుగోలుదారులు కాస్ట్ కటింగ్ డీల్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే నిర్మాత డీవీవీ దానయ్య మాత్రం ఎలాంటి డిస్కౌంట్లు ఇవ్వడం లేదట.

ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ డే 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకు మంచి టాక్ వస్తే ఈ అవాంతరాలన్నీ త్వరితగతిన క్లియర్ అవుతాయి. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం. కానీ యావరేజ్ లేదా బిలో యావరేజ్ టాక్ వస్తే ఏమవుతుందనేదే చూడాలి.
Tags:    

Similar News