స్టార్ సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ వద్ద వుండే సందడే వేరు.. అభిమానులు చేసే హంగామా కూడా భారీగానే వుంటోంది. దీంతో చిన్న సినిమాలు స్టార్ సినిమాతో పోటీగా బరిలోకి దిగడానికి భయపడుతుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా ఓ స్టార్ హీరో సినిమా చాలా వరకు చిన్న చిత్రాలని రిలీజ్ విషయంలో గందరగోళంలో పడేస్తోంది. వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` తరువాత చేస్తున్న చిత్రం `భీమ్లా నాయక్`. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుయ్ కోషియుమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
రానా మరో హీరోగా నటిస్తున్న ఈమూవీలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే తో పాటు రచనా సహకారం అందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలకు హ్యూజ్ క్రేజ్ ఏర్పడింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాచ్ వర్క్, ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ఆ షూటింగ్ ని కంప్లీట్ చేసే పనిలో టీమ్ వుంది.
పవన్ పాల్గొనగా ప్రస్తుతం పాటని చిత్రీకరిస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఏపీ టికెట్ రేట్ల పెరుగుదలకు సంబంధించిన ప్రతిష్టంభన , నైట్ కర్ఫ్యూ, 50 వాతం అక్యుపెన్సీ వంటి సమస్యల కారణంగా `భీమ్లా నాయక్` విడుదల పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 25న విడుదల చేస్తామంటూ మేకర్స్ ప్రకటించినా ఇంత వరకు దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో చాలా వరకు చిన్న చిత్రాల రిలీజ్ ల విషయంలో గందరగోళం మొదలైంది.
ఏపీలో తాజాగా నైట్ కర్ఫ్యూని సడలించినా `భీమ్లా నాయక్` టీమ్ నుంచి ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ విషయంలో ఎలాంటి ప్రకటన రాకపోవడం మరింత కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తోంది. `భీమ్లా నాయక్` రిలీజ్ డేట్ నే అంటే ఫిబ్రవరి 25న వరుణ్ తేజ్ నటించిన `గని` రిలీజ్ ని ప్రకటించారు. ఇదే తేదీని యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన `సెబాస్టియన్` రిలీజ్ కోసం ప్రకటించారు. ఈ రెండు చిత్రాల రిలీజ్ ఇప్పడు `భీమ్లా నాయక్` కోర్టులో వుంది.
కానీ `భీమ్లా నాయక్` మేకర్స్ నుంచి రిలీజ్ డేట్ ఇదంటూ ఒక్క ప్రకటన కూడా రాకపోవడంతో చిన్న చిత్రాల హీరోలు తమ సినిమాని ఫిబ్రవరి 25న రిలీజ్ కి రెడీ చేసుకోవాలా? లేక మానుకోవాలా? అని తలపట్టుకుంటున్నారట. ఈ విషయంలో ఈ రోజు అంటే మంగళవారం క్లారిటీ రానుందని ఇన్ సైడ్ టాక్. అంతే కాకుండా `భీమ్లా నాయక్` రిలీజ్ డేట్ మరోసారి మారిందంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది.
ఫిబ్రవరి 25న కాకుండా `భీమ్లా ... ఏప్రిల్ 7 లేదా 8న వచ్చే ఆవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా `భీమ్లా నాయక్` రిలీజ్ విషయం కారణంగా నెలకొన్న గందరగోళంకు తెరదించాల్సిన బాధ్యత నిర్మాతకే వుంది. ఈ రోజైనా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ ని తొలగించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.