భోళా శంకర్.. మెగాస్టార్ మనసు మారింది!

Update: 2023-01-19 02:30 GMT
మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. జనవరి 13వ తేదీ విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. సంక్రాంతి మొనగాడు అనిపించుకుంటూ... మిగతా అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి తన రాబోతున్న చిత్రం భోళా శంకర్ సినిమా వేసవికి విడుదల అయ్యే అవకాశం లేదని తేల్చి చెప్పారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మితమవుతున్న ఈ సినిమా సమ్మర్‌కి రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించారు.

కానీ షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో సమ్మర్‌కి రిలీజ్ చేయడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. బహుశా దసరాకి సినిమా విడుదల చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే ముందుగా ఈ సినిమాను నెమ్మదిగా పూర్తి చేసి.. దసరాకు విడుదల చేయాలని అనుకున్నా... ఇప్పుడు వీలైనంత త్వరగా పూర్తిచేసి వేసవికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అందుకు గల కారణం వాల్తేరు వీరయ్య రిజల్ట్ అని ఇన్‌ సైడ్‌ వర్గాల సమాచారం.

వాల్తేరు వీరయ్య సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్స్ రాబడుతూ... సెలవులు అయిపోయిన తర్వాత కూడా హౌస్ ఫుల్ షోస్ పడుతూ ఉండడంతో... మెగాస్టార్ చిరంజీవి దానికి కారణం మాస్ కంటెంట్ అనే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భోళా శంకర్ సినిమా మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన... సరైన మాస్ కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు కథతో సంబంధం లేకుండా సినిమాని హిట్ చేస్తారని ఆయన భావిస్తున్నారు.

ఇక ఈ సినిమా కోసం ఒక కలకత్తా సెట్‌ని కూడా హైదరాబాద్‌లో సిద్ధం చేశారు. అందులో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి షూట్‌లో పాల్గొన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై వారం రోజులు కూడా పూర్తికాకుండానే ఆయన ఈ సినిమా షూట్‌కి వెళ్లడానికి గల కారణం కూడా వాల్తేరు వీరయ్య సినిమా ఇచ్చిన బూస్టప్ అని తెలుస్తోంది.

వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేసి వేసవికి కచ్చితంగా రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఆదరణ ఏమాత్రం తగ్గదని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News