మెగాస్టార్ చిరంజీవి `వాల్టేర్ వీరయ్య` అనే మాస్ ఎంటర్ టైనర్ తో బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో 90ల నాటి ఊపు మళ్లీ తేవాలన్నది అన్నయ్య చిరు ఆలోచన.
తాజా సమాచారం మేరకు... మెహర్ రమేష్ పుట్టినరోజును వాల్తేర్ వీరయ్య సెట్స్ లో చిరంజీవి ఘనంగా జరిపారు. దర్శకుడు బాబీ - శేఖర్ మాస్టర్ లతో అక్కడ బర్త్ డే బోయ్ కూడా కనిపించారు. సత్యదేవ్- గెటప్ శ్రీను- సప్తగిరి- శ్రీనివాస రెడ్డి తదితరులు కూడా సెట్స్ పై ఉన్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. `వాల్తేరు వీరయ్య` 2023 సంక్రాంతికి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అంతా సవ్యంగా సాగితే భోళా శంకర్ 2023 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆసక్తికరంగా వాల్తేరు వీరయ్య కంటే ముందే ప్రారంభమైన భోళాశంకర్ రేసులో వెనకబడింది. ఈ మూవీ చిత్రీకరణ ఎందుకనో అంతకంతకు ఆలస్యమవుతోంది. మెహర్ ని కాదని అన్నయ్య బాబీ కోసం ఫుల్ కాల్షీట్లు కేటాయించడం వెనక ఏం జరుగుతోందో అంటూ గుసగుసలు వినిపించాయి. అయితే చిరు తన వేషధారణ మార్పు కోసం అనుకూలత కోసం ఇలా షెడ్యూళ్లను ఇరువురు డైరెక్టర్స్ నడుమా ఎక్స్ ఛేంజ్ చేసుకుంటున్నారని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. గాడ్ ఫాదర్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన చిరు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ గ్యాంగ్ లీడర్ - రౌడీ అల్లుడు తరహా హిట్లు కొట్టేయాలని కసితో పని చేస్తున్నారు.
మెహర్ కంబ్యాక్ సాధ్యమేనా?
శక్తి- బిల్లా - షాడో లాంటి భారీ చిత్రాల్ని తెరకెక్కించి వరుసగా డిజాస్టర్లు అందుకున్న మెహర్ రమేష్ చాలా కాలంగా కంబ్యాక్ కోసం ఆశగా వేచి చూస్తున్నారు. అవకాశాల్లేని క్రమంలో అన్నయ్య స్నేహహస్తం అందించి మెహర్ కి ఓ భారీ అవకాశమిచ్చారు. ఇంతకుముందు కరోనా క్రైసిస్ కాలంలో మెగాస్టార్ చేపట్టిన పరిశ్రమ కార్మికులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని మెహర్ రమేష్ సారథ్యంలో విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. చిరుతో ఆయన ఎంతో సన్నిహితంగా మెలుగుతారు. అన్నయ్యతో సినిమా చేసి కసిగా హిట్ కొట్టి కంబ్యాక్ అవ్వాలని మెహర్ కూడా చాలా శ్రమిస్తున్నారు.