కొత్త భూతం వస్తోంది

Update: 2019-06-11 04:48 GMT
పదహారేళ్ళ క్రితం రామ్ గోపాల్ వర్మ హిందీలో తీసిన భూత్ ఇప్పటికీ హారర్ ప్రియుల హాట్ ఫెవరెట్ గా చెప్పుకోవచ్చు. దాన్ని తెలుగులో పన్నెండవ అంతస్తుగా డబ్బింగ్ చేస్తే ఇక్కడా మంచి స్పందన దక్కించుకుంది. ఒకరకంగా చెప్పాలంటే బాలీవుడ్ లో దెయ్యాల సినిమాలకు ఊతమిచ్చింది ఈ భూతే. ఊర్మిళకు అదనంగా కెరీర్ దక్కింది కూడా దీనివల్లే. ఇన్నాళ్లకు ఇదే పేరుతో మరో మూవీ వస్తోంది.

సుప్రసిద్ధ ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ విక్కీ కౌశల్ హీరోగా టాయిలెట్ ఫేమ్ భూమి పెడ్నేకర్ హీరోయిన్ గా నిర్మిస్తున్న భూత్ నవంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దీని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అయితే దీనికి సీక్వెల్స్ ఉన్నాయి. ఇది మొదటి భాగం. భూత్ ది హాంటెడ్ షిప్ పేరుతో రూపొందిన దీనికి భాను ప్రతాప సింగ్ దర్శకత్వం వహించారు.  ఇదిప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వర్మ కూడా పోస్టర్ అద్భుతంగా ఉందని విక్కీ కౌశల్ ని ఎన్నడూ చూడని పాత్రలో స్క్రీన్ మీద పెర్ఫార్మ్ చేయడం ఎంజాయ్ చేయాలనిపిస్తోందని ట్వీట్ చేశాడు. దీనికి కరన్ జోహార్ బదులుగా థాంక్స్ చెప్పేశాడు.

ముంబై టాక్ ప్రకారం ఈ భూత్ కథ ఓ పాడుబడిన షిప్పులో సాగుతుందట. అనుకోకుండా హీరో టీమ్ అందులోకి వెళ్లడం దానికో దారుణమైన ఫ్లాష్ బ్యాక్ ఉండటం చనిపోయిన వాళ్లంతా అందులోనే దెయ్యాలుగా తిష్ట వేయడం లాంటివి చాలా థ్రిల్స్ ఉంటాయట. డెత్ షిప్ అనే హాలీవుడ్ మూవీ స్ఫూర్తిగా చెబుతున్నారు కానీ అఫీషియల్ గా ధర్మా సంస్థ ప్రకటించలేదు. యుఆర్ఐతో సోలో హీరోగా రెండు వందల కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన విక్కీ కౌశల్ కు భూత్ స్పెషల్ మూవీగా నిలిచేలా ఉంది
Tags:    

Similar News