బిగ్‌ బాస్‌: ఓట్ల కోసం కంటెస్టంట్స్ తిప్పలు...ఓట్లు పడతాయా..?

Update: 2019-10-24 05:59 GMT
బిగ్ బాస్ క్లైమాక్స్ కు వచ్చేయడంతో కంటెస్టంట్స్ ఓట్ల కోసం నానా తిప్పలు పడుతున్నారు. రాహుల్ ఎలాగో ఫినాలేకి వెళ్లిపోవడంతో మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఇంటి నుంచి బయటకెళ్లిపోయి, మిగతా నలుగురు ఫినాలేలో తలపడతారు. అయితే వీరికి అభిమానులు ఓట్లు వేసేందుకు బిగ్ బాస్ అదిరిపోయే టాస్క్ లు ఇచ్చారు. ఆ టాస్కుల ద్వారా తమ అభిమానులని మెప్పించి ఓట్లు వేయించుకునేలా చేసుకోవాలని బిగ్ బాస్ సూచించాడు.

అయితే ఓట్ల కోసం కంటెస్టంట్స్ ఎక్కడా తగ్గలేదు. ప్రతి ఒక్కరూ కష్టపడి టాస్క్ లు పూర్తి చేయడానికి ప్రయత్నించారు. బిగ్ బాస్ అయిదుగురుకు ఐదు టాస్క్ లు ఇచ్చారు. అందులో మొదట వచ్చిన టాస్క్ తాను చేస్తానని వరుణ్ ముందుకొచ్చాడు. ఆ టాస్క్ ఏంటంటే ఒక పెద్ద స్టిక్ పట్టుకుని ఒక ఎత్తులో ఉన్న పోల్ కు ఉన్న రింగ్ లో పెట్టి ఉంచాలి. అయితే రింగ్ కు మంట ఉంది. దాంతో స్టిక్..రింగుకు గానీ, మంట గానీ తగలకూడదు. ఒకవేళ తగిలితే మంట రింగ్ మొత్తం వచ్చేస్తుంది. ఇలా ఐదు అవకాశాలు వరుణ్ కు ఇచ్చారు. ఐదు అవకాశాల్లో ఫెయిల్ అయితే...వరుణ్ ఓడిపోయినట్లే. కానీ వరుణ్ గట్టిగానే కష్టపడి టాస్క్ ఆడాడు.

తర్వాత వచ్చిన టాస్క్ బాబా భాస్కర్ చేశారు. గార్డెన్ ఏరియాలో ఉన్న పోల్ ఎక్కి దానిపై నిల్చోవాలి. అయితే పోల్ కు చిన్న మెట్లు మాత్రమే ఉన్నాయి. అవి కాళ్ళు పెట్టుకోవడానికి అసలు చాలవు. అయినా బాబా బిగ్ బాస్ ఆదేశాలు వచ్చేవరకు అలాగే నిలబడ్డారు. త‌ర్వాత‌ శివజ్యోతి...పాలల్లో కోడి గుడ్డు వేసుకుని కలుపుకుని తాగాలి. ఓట్ల కోసం శివజ్యోతి ఏ మాత్రం తగ్గకుండా వాటిని తాగింది. ఇక అలీ పోల్ కు వేలాడుతున్న రెండు ఇసుక మూటలని రెండు చేతులతో పట్టుకుని ఉండాలి. ఆ మూటలు రెడ్ కలర్ లైన్ దాటకుండా పట్టుకోవాలి. అలీ అలాగే పట్టుకుని ఉన్నాడు.

ఇక చివరిగా శ్రీముఖికు చేప నోట్లో ఉన్న మౌత్ ఆర్గాన్ ఊదుతూనే ఉండాలని ఆదేశించారు. అలాగే శ్రీముఖి అసహ్యంతోనే చేప నోట్లో ఉన్న మౌత్ ఆర్గాన్ ఊదుతూనే ఉంది. ఈ విధంగా ఐదుగురు కంటెస్టంట్స్ ఎంత కష్టమైన ఓట్ల కోసం టాస్క్ లు పూర్తి చేశారు. మరి వారికి వీటి వల్ల ఏ స్థాయిలో ఓట్లు పడ్డాయో తెలియాలంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే. 
Tags:    

Similar News