ట్రెండీ టాక్‌: చిన్నోళ్ల‌కు `పెద్ద` సాయం

Update: 2019-03-14 17:30 GMT
చిన్న సినిమాల‌కు పెద్ద‌న్న‌ల సాయం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. మెగా హీరోలు.. అల్లు హీరోలు.. నంద‌మూరి హీరోలు.. ద‌గ్గ‌బాటి హీరోలు.. అక్కినేని హీరోలు .. కాంపౌండ్ ఏదైనా చిన్న సినిమాలకు ప్ర‌చార సాయం అందించేందుకు ముందుకొస్తున్నారంతా. త‌మ‌కు అత్యంత స‌న్నిహితులు అయినా లేదా మంచి సినిమా అనో..  అభిమానం అనే క‌నెక్ష‌న్ ఉన్నా ప్ర‌చారం సాయం చేస్తూ బూస్ట్ ఇస్తున్నారు. నిర్మాత‌ల హోదాలో నాగార్జున‌, దిల్ రాజు వంటి వారు ఈ త‌ర‌హా ప్ర‌చార సాయం చేస్తున్నారు. రిలీజ్ ల‌కు సాయ‌ప‌డుతున్నారు.

ఇటీవ‌లే వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ కోసం బ‌న్ని `ల‌వ‌ర్స్ డే` చిత్రానికి ప్ర‌చార సాయం అందించారు. త‌న‌ని ఎంక‌రేజ్ చేసిన మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ నుంచి వ‌స్తున్న ప్రియా అండ్ టీమ్ కోస‌మే ఈ ప్ర‌చార సాయం అని బ‌న్ని తెలిపారు. అదే తీరుగా నంద‌మూరి, ద‌గ్గుబాటి హీరోలు ప్ర‌చార సాయం చేయ‌డానికి ముందుకు రావ‌డం విశేషం. త్వ‌ర‌లో రిలీజ్ కి వ‌స్తున్న `ఎదురీత`కు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్ర‌చారంలో సాయం అందిస్తున్నారు. స‌హాయ‌న‌టుడు శ్రావ‌ణ్ న‌టిస్తున్న చిత్ర‌మిది. లియోన‌, అర్జున్ రెడ్డి ఫేం జియా శ‌ర్మ న‌టీన‌టులు. ఎదురీత క‌థాంవం ఆస‌క్తిక‌రం. 40 ఏళ్ల తండ్రికి అత‌డి కుమారుడికి మ‌ధ్య ఉన్న అనుబంధం నేప‌థ్యంలో  తెర‌కెక్కిన ఈ చిత్రానికి ఎన్టీఆర్ న‌టించిన 1975 క్లాసిక్ సినిమా `ఎదురీత‌`కు రిలేష‌న్ ఉంద‌ట‌. లాజిక్ ఏదైనా నంద‌మూరి హీరో ప్ర‌చార సాయం చేస్తున్నారు.

అలాగే ద‌గ్గు బాటి రానా ఇటీవ‌ల ఆఫ్ బీట్ చిత్రాల‌కు ప్ర‌చార సాయం అందిస్తున్నారు. ఇదివ‌ర‌కూ `కేరాఫ్ కంచ‌ర‌పాలెం` అనే నాన్ క‌మర్షియ‌ల్ చిత్రానికి రానా ప్ర‌చారం చేశారు. ఆ సినిమా రిలీజ్ కోసం ద‌గ్గుబాటి సురేష్ బాబు- రానా చాలానే సాయం చేశారు. ఓ ఎన్నారై నిర్మాత ఈ సినిమాని నిర్మించారు. ప్ర‌స్తుతం రానా - సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ దృష్టి ` ఫ‌ల‌క్ నుమా దాస్` చిత్రంపై ఉందిట‌. ఈ సినిమా రిలీజ్ ప్ర‌మోష‌న్స్ కి .. రిలీజ్ కి రానా సాయం అందించ‌నున్నారు. ఇదే కాదు.. ఇటీవ‌ల‌ ప‌లు చిన్న సినిమాల‌కు అగ్ర హీరోలు ప్ర‌చార సాయం చేస్తున్నారు. దీనివ‌ల్ల ఆ సినిమాలు జ‌నాల్లోకి వెళుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ వ‌ల్ల చిన్న సినిమాల‌కు కొంత మేలు జ‌రుగుతోంద‌న్న‌ది వాస్త‌వం. ఇలా స్టార్లు ప్ర‌మోష‌న్ చేసినా హిట్లు కొట్టేస్తున్నాయా? అంటే క‌ష్ట‌మే. ల‌వ‌ర్స్ డే ఫ‌లితం ఏంటో తెలిసిందే. ఇక‌  వీటిలో కంటెంట్ ఉన్న‌వి ఆడుతున్నాయి. కంటెంట్ లేకపోతే య‌థావిధిగా ఫ్లాప్ లు అవుతున్నాయి. స్టార్లు కేవ‌లం ప్ర‌చార సాయం వ‌ర‌కే ప‌రిమితం.


Tags:    

Similar News