సోని పిక్చ‌ర్స్ కి బిగ్ పంచ్‌!

Update: 2019-05-09 07:59 GMT
ప్ర‌ఖ్యాత సోని పిక్చ‌ర్స్ ప్ర‌స్థానం గురించి తెలిసిందే. హాలీవుడ్ బెస్ట్ సినిమాల్ని ఇండియాలో రిలీజ్ చేస్తూ సంచ‌ల‌నాలు సృష్టిస్తూనే ఉంది. ద‌శాబ్ధాల పాటు బాలీవుడ్ తో పాటు.. సౌత్ ఇండ‌స్ట్రీస్ తో అనుబంధం కొన‌సాగిస్తున్న సోని సంస్థ ఇప్ప‌టికే ఎన్నో సినిమాల బుల్లితెర రైట్స్ ని ఛేజిక్కించుకుంది. అయితే ఈ సంస్థ చేసిన ఓ త‌ప్పిదంపై కోర్టు అక్షింత‌లు వేయ‌డంపై కార్పొరెట్ వ‌ర‌ల్డ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఇంత‌కీ ఈ సంస్థ ఎలాంటి త‌ప్పు చేసి దొరికిపోయింది? అంటే... నటుడు అజిత్‌ నటించిన వాలి.. సిటిజన్‌.. విల‌న్.. వాంజినాథ‌న్ స‌హా 17 సినిమాల పాట‌ల్ని సోని సంస్థ ఎల‌క్ట్రానిక్ మీడియా(టీవీ/  రేడియో వ‌గైరా)లో ప్రసారం చేయడంపై మద్రాసు హైకోర్టు నిషేధం విధించింది. నగరానికి చెందిన పేషోర్‌ రికార్డ్స్‌ సంస్థ మద్రాసు హైకోర్టు లో దాఖలు చేసిన పిటీషన్‌ లో ఆయా సినిమాల ఆడియో హ‌క్కుల విష‌యంలో త‌మ‌కు హ‌క్కు ఉంద‌ని పేర్కొంటూ కోర్టులో వాదించింది. సోని మ్యూజిక్ హ‌క్కుల్ని దుర్వినియోగం చేస్తోంది. థింక్‌ మ్యూజిక్‌.. యూ ట్యూబ్‌.. గానా మిక్సీ తదితర చానళ్లలో సోనీనే స్వ‌యంగా ప్రసారం చేస్తోందని.. ఇది కాపీ రైట్‌ నిబంధనలకు విరుద్ధ‌మ‌ని స‌ద‌రు సంస్థ పిటీష‌న్ లో పేర్కొంది. ఈ విష‌యంపై సోనీని సంప్ర‌దించినా స‌రిగా స్పందించ‌లేద‌న్న‌ది ఆరోప‌ణ‌. దీంతో ఆ 17 చిత్రాల పాట‌ల‌ను సోని సంస్థ ఈమీడియా ప్ర‌సారంలో హ‌క్కులు కోల్పోయిన‌ట్టేన‌ని కోర్టు తీర్పును వెలువ‌రించింది.

సోని సంస్థ నుంచి ఈ స‌మ్మ‌ర్ లో వ‌రుస‌గా ధ‌మాకా సినిమాలు క్యూ క‌ట్ట‌నున్నాయి. మార్వ‌ల్ - డిస్నీ సంయుక్త నిర్మాణం నుంచి వ‌స్తున్న `స్పైడ‌ర్ మాన్ :  ఫార్ ఫ్రం హోం` చిత్రాన్ని సోనీ సంస్థ ఇండియాలో రిలీజ్ చేస్తోంది.  ఫార్ ఫ్రం హోం తాజా ట్రైల‌ర్ ఇప్ప‌టికే 135 మిలియ‌న్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. అలాగే విల్ స్మిత్ న‌టించిన `మెన్ ఇన్ బ్లాక్` సిరీస్ కి సీక్వెల్ గా వ‌స్తున్న కొత్త సినిమాని సోని సంస్థ మ‌న దేశంలో రిలీజ్ చేస్తోంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ యూట్యూబ్ లో 20ల‌క్ష‌ల వ్యూస్ తో సునామీ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. `మెన్ ఇన్ బ్లాక్: ఇంట‌ర్నేష‌న‌ల్` చిత్రంలో క్రిస్‌ హేమ్స్ వ‌ర్త్ .. టెస్సా థాంప్స‌న్ త‌దిత‌రులు న‌టించారు.
Tags:    

Similar News