#AA21 సుక్కూకి ఇదేం టెన్ష‌న్‌?

Update: 2020-03-10 05:59 GMT
డెడ్ లైన్ పెట్టి పూర్తి చేయాలంటే ఏ ద‌ర్శ‌కుడికి అయినా క‌ష్ట‌మే. అయితే బ‌డ్జెట్లు పెర‌గ‌కుండా ఉండాలంటే ఈ రూల్ త‌ప్ప‌నిస‌రి. ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాల‌కు ఇది మ‌రీ త‌ప్ప‌నిస‌రి. అయితే భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు స్టార్ రేంజ్ సినిమాల‌కు కొంత వెసులుబాటు ఉంటుంది కానీ.. చిన్న సినిమాల‌కు అయితే బ‌డ్జెట్ - టైమ్ బౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఏఏ 21 సినిమాకి ఈ త‌ర‌హాలో టైమ్ ఫిక్స్ చేసి డెడ్ లైన్ లోగా పూర్తి చేయాల‌ని టెన్ష‌న్ పెడుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం దీనిపై సుక్కూ కాస్తంత ఆందోళ‌న‌గానే ఉన్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

క్రియేటివిటీ ప‌ర్ఫెక్ష‌న్ ఉన్న చోట డెడ్ లైన్లు కుద‌ర‌దు. సుక్కూ అస‌లే కాంప్లికేటెడ్ మ్యాథ‌మెటీషియ‌న్. ప్ర‌తిదీ లెక్క ప్ర‌కారం రావాల్సిందే. విజువ‌లైజేష‌న్ ప‌రంగా ఏమాత్రం రాజీకి రాడు. దానివ‌ల్ల ఎక్కువ స‌మ‌యం తీసుకుంటాడు. అది నిర్మాత‌ల‌పై ఒత్తిడి పెంచేదిగానే ఉంటుంది. అయితే ఈసారి ఏఏ 21 చిత్రాన్ని మాత్రం ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయాల‌ని నిర్మాణ సంస్థ‌లు మైత్రి మూవీ మేక‌ర్స్ - గీతా ఆర్ట్స్ భావిస్తున్నాయ‌ట‌.

అయితే ఈ డెడ్ లైన్ ని అధిగ‌మించాలంటే ముందే టెస్ట్ షూట్ చేయ‌డం ద్వారా స‌మ‌యాన్ని ఎలా త‌గ్గించ‌వ‌చ్చు అన్న‌ది సుక్కూ ఆలోచించాడ‌ట‌. అందుకు త‌గ్గ‌ట్టే ద‌ట్ట‌మైన అడ‌వుల్లో ఎలాంటి కాంప్లికేష‌న్స్ ఉంటాయో ముందే చెక్ చేసుకునేందుకు టెస్ట్ షూట్ కూడా చేశాడ‌ట‌. భారీ కెమెరాలు.. క్రేన్లు.. లైటింగ్ ఎక్విప్ మెంట్ వ‌గైరా డీప్ ఫారెస్ట్ లోకి తీసుకెళితే అయ్యే టైమ్ వేస్ట్ ని ఎలా త‌గ్గించాలో స్ట‌డీ చేశాడ‌ట‌. మొత్తానికి ద‌స‌రా రిలీజ్ ధ్యేయంగా సుక్కూ అన్నిర‌కాలా స్కెచ్ వేస్తున్నాడ‌నే భావించ‌వ‌చ్చు. అయితే అనుకున్న ప్ర‌కారం షూట్ పూర్త‌యితే రిలీజ్ స‌మ‌స్య ఏమీ ఉండ‌దు. అలాగ‌ని ద‌స‌రా అనే మ‌డిక‌ట్టుకుని కూచున్నా క్రియేటివిటీ పై కొంత దెబ్బ ప‌డుతుంది మ‌రి!! ద‌స‌రా అంటే 25 అక్టోబ‌ర్.. ప్ర‌స్తుతం మార్చిలో ఉన్నాం కాబ‌ట్టి.. 7-8 నెల‌ల స‌మ‌యం ఉన్న‌ట్టు. ఈ టైమ్ లోనే షూటింగ్ నిర్మాణానంత‌ర ప‌నులు చ‌క‌చ‌కా పూర్తి చేయాల్సి ఉంటుంద‌న్న‌మాట‌.
Tags:    

Similar News