జనరల్ కమర్షియల్ సినిమాలను పక్కనబెడితే ఒక సెక్షన్ ను టార్గెట్ గా చేసుకొని తెరకెక్కించే సినిమాలు కొన్ని ఉంటాయి. వీటిలో అడల్ట్ సినిమాల జోనర్ ఒకటి. ఈ సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందంటే.. అందరూ చూస్తారు. కానీ ప్రైవేటుగా. కానీ చాలామంది తాము చూసినట్టు ఒప్పుకోరు. ఎందుకంటే మనం ఉండేదే బేసిగ్గా హిపోక్రసీ ఎక్కువగా ఉండే సమాజం. సన్నీ లియోన్ గూగుల్ సెర్చ్ ర్యాంకింగ్స్ లో ఎందుకు చాలా ఏళ్ళు నెంబర్ 1 గా వచ్చింది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన హిపోక్రసీ ఏ రేంజ్ లో ఉందో తెలిసిపోతుంది.
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 'చీకటిగదిలో చితక్కొట్టుడు' అనే అడల్ట్ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అందరూ ఈ ట్రైలర్ ను ఎగబడి చూసేసరికి ఇప్పటికే ఈ ట్రైలర్ కు రెండ్రోజుల్లోనే 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే ఈ ట్రైలర్ యూట్యూబును చితక్కొట్టిందనేగా అర్థం. చాలామంది ఈ ట్రైలర్ ను వల్గర్ అని.. బూతని విమర్శిస్తున్నారు. అయినా అడల్ట్ సినిమాలో ఆత్మ- పరమాత్మ-అంతరాత్మ సంబంధం.. నేనెవరు.. ఈ లోకానికి ఎందుకొచ్చాను.. మనిషిగా నా గమ్యం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు.. వాటికి వివరంగా సమాధానాలు చర్చిస్తారా?
నిజం చెప్పుకుంటే ఈ సినిమా ట్రైలర్ ను అడల్ట్ ట్రైలర్ అని చిన్నమాటతో సరిపుచ్చలేం... ఆ బూతును చిన్నబుచ్చలేం! మహా బూతు ఉండే మెగా అడల్ట్ ట్రైలర్ అని బిరుదు ఇవ్వాల్సిందే. మరి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో!