బాల‌య్య 'NBK107' రిలీజ్‌పై బిగ్ అప్డేట్‌..?!

Update: 2022-03-28 04:29 GMT
వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ 'అఖండ‌' సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కారు. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన ఈ చిత్రం గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లై.. బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఈ సినిమా అనంత‌రం బాల‌య్య త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను 'క్రాక్‌' డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో అనౌన్స్ చేశారు.

 'NBK107' వ‌ర్కింగ్ టైటిల్‌తో ప్రారంభ‌మైన ఈ చిత్రంలో అందాల భామ శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలయ్య ను ఢీ కొట్టే విలన్ పాత్రను కన్నడ నటుడు దునియా విజయ్ చేస్తున్నాడు.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవలే తెలంగాణలో ప్రారంభమైంది. ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌తో షూటింగ్‌ను షురూ చేయ‌గా.. మొద‌టి రోజే బాల‌య్య‌ లుక్ లీకైంది.

దాంతో చేసేదేమి లేక మేక‌ర్స్ వెంట‌నే అధికారికంగా బాల‌య్య ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ పోస్ట‌ర్‌కు విశేష స్పంద‌న ల‌భించింది. మాస్ మసాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అదేంటంటే.. ఈ సినిమాను ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. ఈలోగా షూటింగ్‌ను కంప్లీట్ చేసి.. ప్ర‌మోష‌న్స్‌తో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయాల‌ని  భావిస్తున్నార‌ట‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోయినా.. సోష‌ల్ మీడియాలో మాత్రం విసృతంగా ఈ వార్త వైర‌ల్ అవుతోంది.

కాగా, న‌వీన్ ఎర్నేని, వై ర‌వి శంక‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది.  ఈ చిత్రం వేటపాలెంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంద‌ని.. ఇందులో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నార‌ని టాక్‌.
Tags:    

Similar News