తెలుగు.. తమిళ బిగ్ బాస్ అరంగేట్ర సీజన్లు ముగిశాయి. వాటి గురించి చర్చలు ఆగిపోయాయి. ఇంతలో హిందీ ‘బిగ్ బాస్’ వార్తల్లోకి వచ్చింది. ఆరంభం నుంచి ఈ షో తీవ్ర వివాదాస్పదమవుతోంది. షోలో తొలి రోజు నుంచి గొడవలే గొడవలు నడుస్తున్నాయి. తాజాగా ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన జుబేర్ ‘బిగ్ బాస్’ షో మీద.. దాని హోస్ట్ సల్మాన్ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. తనను హౌజ్ లోపల తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు.. తాను ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్లు జుబేర్ వెల్లడించాడు. అంతే కాదు.. తనను ఇబ్బందుల పాలు చేసినందుకు సల్మాన్ మీద కేసు పెట్టడానికి కూడా జుబేర్ రెడీ అవడం గమనార్హం.
ఆదివారం నాటి ‘బిగ్ బాస్’ ఎపిసోడ్లో జుబేర్.. సల్మాన్ తో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంగా జుబేర్ మీద సల్మాన్ కూడా మండిపడ్డాడు. ఆ వివాదం తర్వాత జుబేర్ ను ‘బిగ్ బాస్’ నుంచి ఎలిమినేట్ చేశారు. దీంతో అతను మీడియా ముందుకొచ్చి తీవ్ర ఆరోపణలు చేశాడు. బిగ్‌బాస్ ఫేక్ షో అని.. ఇంటి సభ్యులకు ఏమి చేయాలో వారే సలహాలు.. సూచనలు ఇస్తుంటారని అతనన్నాడు. ‘బిగ్ బాస్’ హోస్ట్ సల్మాన్ ఖాన్ ఓ ఆట బొమ్మ అని.. డబ్బు కోసం స్టేజీల మీద అర్థనగ్నంగా డాన్సులు చేస్తాడని విమర్శించాడు. సల్మాన్ కు భయపడటానికి తానేమీ వివేక్ ఓబెరాయ్ కాదని అన్నాడు. సల్మాన్ కు సారీ కూడా చెప్పబోనని అన్నాడు. తనను దావూద్ ఇబ్రహీం చెల్లెలు హసీనా పార్కర్ బంధువు అంటూ అబద్ధం చెప్పారని జుబేర్ తెలిపాడు. పబ్లిసిటీ కోసం తానేమీ వివాదాలు రాజేయడం లేదని.. దావూద్ ఇబ్రహీం పేరును వాడుకోని షో రేటింగ్ పెంచుకోవాలని ఛానెల్.. సల్మాన్ చూస్తున్నారని అతను దుయ్యబట్టాడు. తానే బిగ్ బాస్ హౌస్ వదిలి వచ్చా తప్ప తనను ఎవరూ ఎలిమినేట్ చేయలేదని.. కెమెరా ద్వారా సల్మాన్ తనను బెదిరించాడని.. తనను చాలా నీచంగా చూశాడని జుబేర్ వివరించాడు. ఛానెల్ తో ఉన్న ఒప్పందం వల్ల హౌస్ లోని సెలబ్రెటీలు నోరు తెరవడానికి భయపడుతున్నారని జుబేర్ అన్నాడు.