బిగ్‌ బాస్ 5 : ఒక రోజు ముందే వారిద్దరు ఎలిమినేట్‌

Update: 2021-12-19 08:36 GMT
తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 విజేత ఎవరు అనేది మరి కొన్ని గంటల్లో అధికారికంగా క్లారిటీ రాబోతుంది. బిగ్‌ బాస్ సీజన్‌ 5 విజేత సన్నీ అంటూ ఇప్పటికే అంతా చాలా నమ్మకంగా బలంగా చెబుతున్నారు. ప్రేక్షకులు అందరికి కూడా నేడు సాయంత్రం ఆరు గంటలకు షో ప్రారంభం అవ్వబోతుంది. షో మొత్తం కూడా ఈ ఒక్క రోజు షూటింగ్‌ జరిగినట్లుగా చూపిస్తారు. కాని స్టార్‌ మా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 17వ తారీకు నుండే ఫినాలే ఎపిసోడ్‌ కు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. 17వ తారీకున మాజీ కంటెస్టెంట్స్ డాన్స్ లు మరియు కంటెస్టెంట్స్ తో ఇంట్రాక్షన్ జరిగిందట. ఇక నిన్న అంటే 18వ తారీకున మానస్ మరియు సిరిలు ఎలిమినేట్ అయిన ఎపిసోడ్‌ ను చిత్రీకరించారు. మొదటగా సిరి ఎలిమినేట్‌ అవ్వగా ఆ తర్వాత మానస్ బయటకు వచ్చేశాడు.

నిన్న సాయంత్రం వరకు వీరిద్దరి ఎలిమినేషన్ చిత్రీకరణ పూర్తి అయ్యింది. అంతే కాకుండా బాలీవుడ్‌ స్టార్‌ లవ్ బడ్స్ రణబీర్‌ మరియు ఆలియాలు కూడా నిన్ననే బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయడం జరిగింది. అంతే కాకుండా నాని తో పాటు శ్యామ్‌ సింగ రాయ్ టీమ్‌ మొత్తం కూడా నిన్ననే స్టేజ్ పై అలరించారు. నాని స్వయంగా హౌస్‌ లోనికి వెళ్లి మానస్ ను ఎలిమినేట్‌ చేసి బయటకు వచ్చాడు. ఇక రాజమౌళి కూడా నిన్న నే వచ్చాడు. నిన్నటి షూటింగ్‌ కాకుండా నేడు సాయంత్రం మళ్లీ ఫినాలే చివరి 30 నిమిషాలను చిత్రీకరించబోతున్నారు. కేవలం గంట వ్యవధిలో లైవ్‌ టెలికాస్ట్‌ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

నేడు బిగ్‌ బాస్ స్టేజ్ పై ఎవరు ఉంటారు అనేది అంతా ఆసక్తిగా ఉంది. తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 3 మరియు 4 కు చిరంజీవి గెస్ట్‌ గా వచ్చాడు. మళ్లీ ఆయనే వచ్చే అకవాశాలు ఉన్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ లు బిగ్‌ బాస్ స్టేజ్ పై సందడి చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్ మరియు ఎన్టీఆర్‌ లు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ప్రమోషన్ కోసం ముంబయిలో ఉన్నారు. వారు సాయంత్రంకు హైదరాబాద్‌ చేరుకుని కాస్త పొద్దు పోయినా బిగ్ బాస్ స్టేజ్ ఎక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి బిగ్‌ బాస్ సీజన్ 5 విజేతకు ట్రోఫీ ఇచ్చేది ఎవరు అనే విషయం క్లారిటీ లేదు. కాని మానస్ మరియు సిరిలు ఎలిమినేట్ అయ్యారు.. వారు ఇప్పుడు అన్న పూర్ణ స్టూడియోలోనే సీక్రెట్‌ గా ఉన్నారు. వారికి ఇంకా కనీసం కుటుంబ సభ్యులను కూడా కలిసే అవకాశం కల్పించలేదు.


Tags:    

Similar News