అప్ఘనిస్తాన్ క్రికెటర్ తో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Update: 2021-08-23 23:30 GMT
బిగ్ బాస్ బ్యూటీ , టెలివిజన్ స్టార్ అర్షిఖాన్ అప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్ఘనిస్తాన్ లో తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన అర్షిఖాన్ తాలిబన్లు అప్ఘనిస్తాన్ ను వశం చేసుకోవడంతో తన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా వెల్లడించారు.

తాలిబన్ల దురాక్రమణ వల్ల ఇప్పుడు అప్ఘనిస్తాన్ దేశమంటే ప్రపంచమంతా వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే అక్టోబర్ లో బిగ్ బాస్ బ్యూటీ అర్షిఖాన్ ఒక అప్ఘన్ క్రికెటర్ తో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టుగా.. తాలిబన్ల కారణంగా రద్దు చేసుకుంటున్నానని వెల్లడించారు.

తన తండ్రి తన కోసం అప్ఘనిస్తాన్ క్రికెటర్ ను ఎన్నుకున్నాడని.. అయితే తాలిబన్లు అప్ఘనిస్తాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న కారణంగా కుటుంబం నిశ్చితార్థాన్ని రద్దు చేయాలని భావిస్తున్నట్టుగా ఆమె వెల్లడించారు. తాను వివాహమాడాలి అనుకున్న క్రికెటర్ పేరును వెల్లడించకుండా కేవలం తన నిశ్చితార్థాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఆమె తెలిపారు.

బిగ్ బాస్ 11 హిందీ కంటెస్టెంట్ ఆర్షిఖాన్.. అప్ఘనిస్తాన్ క్రికెటర్, తన తండ్రి స్నేహితుడి కుమారుడితో నిశ్చితార్థం చేసుకుంది. అర్షిఖాన్ తన మూలాలను అప్ఘనిస్తాన్ లో కలిగి ఉన్నానని వెల్లడించారు. ఆమె అప్ఘన్ పఠాన్, ఆమె కుటుంబం యూసుఫ్ జాయ్ పఠాన్ జాతికి చెందనదని తెలిపింది. ఆమె అప్ఘన్ మూలాలు ఉన్నప్పటికీ ఆమె తన తల్లిదండ్రులు భారతీయ పౌరులని.. తాను కూడా భారతీయ పౌరురాలినని అర్షిఖాన్ తేల్చిచెప్పారు. అయితే అప్ఘన్ కు కోడలుకు వెళ్లడం ఇష్టం లేదని.. తాలిబన్ల దాడితోనే పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు అర్షిఖాన్ తెలిపింది.




Tags:    

Similar News