బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని వరుస సినిమా ఆఫర్స్ దక్కించుకుంటున్న భామ మోనాల్ గజ్జర్ ఒక్కరే అనుకుంటా.. ఎందుకంటే బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక మోనాల్ పేరు వార్తలలో వినిపించినట్లుగా ఎవరి పేరు వినిపించడం లేదు. మోనాల్ గజ్జర్ ప్రస్తుతం టీవీలో ఓ రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటుంది.
త్వరలోనే వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని సినిమాలతో బిజీ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ గ్యాప్ లో బిగ్ బాస్ ఫేవరేట్స్ అఖిల్, సోహైల్ లతో కలిసి పార్టీలు పబ్బులు అంటూ ఎంజాయ్ చేస్తుంది. ఇక వివాదాలకు దూరంగా ఉండే మోనాల్ ప్రస్తుతం తన మాటలతోనే వివాదంలో చిక్కుకుంది. తాజాగా మోనాల్ హిందూ దేవుడు శ్రీరాముడి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ అయిపోయాక మోనాల్ వరుస ఇంటర్వ్యూలు, లైవ్ చాట్ లతో ఫుల్ బిజీ అయిపోయింది.
అయితే ఇంటర్వ్యూలలో మోనాల్ ను ఎక్కువగా పెళ్లి గురించి అడుగుతున్నారు. ఈమధ్య అఖిల్ ను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఏమైనా ఉందా?అంటూ అడుగుతున్నారట. మరికొందరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీరాముడి పై మోనాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి భర్త కావాలని యాంకర్ ప్రశ్నిస్తే.. జవాబుగా 'తనకు శ్రీకృష్ణుడి లాంటి భర్త కావాలని' కోరుకుంటున్నట్లుగా చెప్పింది. మరి శ్రీరాముడు ఎందుకు వద్దంటూ ప్రశ్నించగా.. 'నాకు శ్రీరాముడు అంటే నచ్చదు. ఎవరి మాటలో విని భార్యను వదిలేశాడు. అందుకే నేను చేసుకుంటే శ్రీకృష్ణుడు లాంటి భర్తను పెళ్లి చేసుకుంటాను' అంటూ షాకిచ్చింది. ఇక చివరిగా పెళ్ళెప్పుడు అనే ప్రశ్నకు.. 'నా పెళ్లికి ఇంకా సమయం ఉంది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు' అని చెప్పుకొచ్చింది మోనాల్. ప్రస్తుతం మోనాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చిచ్చు రేపుతున్నాయి. నీకేం తెలుసు శ్రీరాముడు గురించి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.