చంద‌మామ ఆకాశాన్ని తాకే వేళ‌.. తోక చుక్కలా దివి మెరిసేనేల‌?

Update: 2021-05-18 07:30 GMT
బిగ్ బాస్ - తెలుగు ఎంద‌రికో రంగుల వినీలాకాశంలో అవ‌కాశాల్ని పెంచుతోంది. పెద్ద తెర డ్రీమ్స్ తో బ‌రిలో దిగుతున్న చాలామంది టాప్ మోడ‌ల్స్ ట్యాలెంట్ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇది స‌రైన వేదిక‌గా మారింది. ఇప్ప‌టికే ప‌లువురు బిగ్ బాస్ ఇంటి స‌భ్యులు.. యాంక‌ర్లుగా.. బుల్లితెర తార‌లుగా.. మ‌రికొంద‌రు వెండితెర‌పై క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా.. హీరోలుగా.. హీరోయిన్లుగా అవ‌కాశాలు అందుకుంటున్నారు.

ఇదే కోవ‌లో మోడ‌ల్ కం న‌టి దివి వ‌ద్య‌త‌కు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని తెలిసింది. బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఈ బ్యూటీ అంద‌చందాలు షోకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌ను తెచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి అంత‌టి పెద్ద స్టార్ త‌న సినిమాలో స్పెష‌ల్ రోల్ ఆఫ‌ర్ చేస్తాన‌ని ప్రామిస్ చేశారంటే అర్థం చేసుకోవ‌చ్చు.

దివి ఇటీవ‌ల త‌న పాపులారిటీని మ‌రింత‌గా పెంచుకునేందుకు వ‌రుస ఫోటోషూట్ల‌తో బ‌రిలో దిగుతోంది. ఇన్ స్టా వేదిక‌గా నిరంత‌రం ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఫాలోవ‌ర్స్ ని యంగేజ్ చేస్తోంది. తాజాగా మ‌రో స్పెష‌ల్ ఫోటోషూట్ తో కుర్రాళ్లను కిల్ చేస్తోంది.

``చంద‌మామ ఆకాశాన్ని తాకే వేళ‌.. తోక చుక్కలా దివి మెరిసేనేల‌?`` అంటూ ఈ ఫోటోషూట్ కి ఇచ్చిన పోయెటిక్ క్యాప్ష‌న్ ఆక‌ట్టుకుంది. ఈ ఫోటోషూట్ కి ఓ అభిమాని ఫిదా అయిపోయి.. ``కిరీటం లేక‌పోయినా నువ్వే రాణివి!`` అంటూ ప్ర‌శంసించారు. సృష్టి స్టైలింగ్.. శ‌ర‌త్ మేక‌ప్.. దివా డిజైన‌ర్ స్టూడియో .. యువి క‌లెక్ష‌న్స్ అంటూ డీటెయిల్స్ అందించింది. నిజానికి దివి పింక్ అండ్ రోజ్ క‌ల‌ర్ లెహెంగా ధ‌రించి వైట్ కాంబినేష‌న్ ఫ్రాకులో దేవ‌తా సుంద‌రినే త‌ల‌పిస్తోంది. త‌న రింగురింగుల‌ కురుల‌కు సాంబ్రాణీ వేస్తున్న కాన్సెప్ట్ ఆక‌ట్టుకుంది. దివికి టాలీవుడ్ లో మంచి భ‌విష్య‌త్ ఉంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. తెలుగ‌మ్మాయిల‌కు తెలుగులో అవ‌కాశాలొస్తున్నాయి. అది త‌న‌కు ప్ల‌స్ కానుంది.
Tags:    

Similar News