పింకీకి జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్‌

Update: 2021-10-07 15:30 GMT
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో స్పెషల్ కంటెస్టెంట్‌ గా ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ ఉంది. గత సీజన్ లో తమన్నా సింహాద్రి చేసిన రచ్చ కారణంగా ప్రియాంక సింగ్‌ ఎలా ఉంటుందో అని చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. సమాజంలో ట్రాన్స్‌ జెండర్స్ గురించి ఒకరకమైన అసహ్య భావం ఉంది. అలాంటి వారు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు.. వారు అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు అంటూ చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాని ప్రియాంక సింగ్‌ విషయంలో అనూహ్యంగా ఆ అభిప్రాయం తప్పు అని నిరూపితం అయ్యింది. ట్రాన్స్ జెండర్ లు ఇలా ఉంటారా అంటూ అంతా నోరు వెళ్లబెట్టే విధంగా ఆమె ప్రవర్తన ఉంది. అందమైన అమ్మాయిగా.. హుందా ప్రవర్తనతో ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటూ గొడవలకు దూరంగా ఉంటూ.. పద్దతిగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి అభిమానంను దక్కించుకున్న ప్రియాంక సింగ్‌ కు జీవితంలో మర్చిపోలేని బహుమానంను బిగ్‌ బాస్ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించిన ప్రోమో వైరల్‌ అవుతోంది.

ట్రాన్స్‌ జెండర్‌ గా మారిన ప్రియాంక సింగ్‌ ఆ విషయాన్ని ఇప్పటి వరకు తన తండ్రికి చెప్పలేదు. బిగ్ బాస్ వేదిక నుండి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఆయన ఎలా రిసీవ్‌ చేసుకుంటాడో అంటూ ప్రియాంక చాలా మదన పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆ సందర్బం రానే వచ్చింది. ప్రియాంక సింగ్‌ పుట్టిన రోజు సందర్బంగా ఆమె తండ్రి వీడియోను స్కీన్‌ లో టెలికాస్ట్‌ చేశారు. నువ్వు అమ్మాయిగా మారినా అబ్బాయిగా మారినా కూడా నీకు మేము అమ్మా నాన్న. కనుక నువ్వు నా వద్దకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రావచ్చు అంటూ ఆయన మాట్లాడిన వెంటనే ప్రియాంక దుఃఖం ను ఆపుకోలేక పోయింది. గుడ్డి వాడు అయిన ప్రియాంక తండ్రికి ఇప్పటి వరకు చరణ్ తేజ్‌ కాస్త ప్రియాంక గా మారిన విషయం తెలియదు.

ఇప్పుడు తెలిసినా కూడా చాలా సంతోషంగానే ఉండటంతో పాటు.. నీవు మాకు గర్వకారణం అంటూ మాట్లాడటంతో పింకీ ఎమోషన్‌ బరస్ట్‌ అయ్యింది. ఆమె ఎమోషన్ కు ఇంట్లో సభ్యులు అంతా కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ తర్వాత పింకీకి బిగ్‌ బాస్ చీర.. గాజులు.. పూలు పంపించాడు. ఇంటి సభ్యులు అంతా కూడా ఆమెకు వాటిని బహూకరించాడు. బిగ్‌ బాస్ ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ మరియు బహుమానం పింకీ జీవితంలోనే అత్యంత అరుదైన అద్బుతమైన బహుమానంగా చెప్పుకోవచ్చు. ఇన్నాళ్లు ప్రియాంక నలుగురిలో తిరిగేందుకు ఇబ్బంది పడేది. కాని ఇప్పుడు గర్వంగా నలుగురిలో తిరిగేలా బిగ్‌ బాస్ టీమ్ చేశారు అనడంలో సందేహం లేదు. అలాంటి ట్రాన్స్ జెండర్స్ ఎంతో మందికి కూడా ప్రియాంక సింగ్‌ ఆదర్శం అనడంలో సందేహం లేదు.
Tags:    

Similar News