బిస్ బాస్ జెస్సీకి వచ్చిన వర్టిగో వ్యాధితో ఎంతటి ఇబ్బందంటే?

Update: 2021-11-10 07:34 GMT
బిగ్ బాస్ సీజన్ 5లో పోటీదారుగా ఉన్న జెస్సీ గడిచిన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. తాను వర్టిగో వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు అతడు చెప్పటం తెలిసిందే. రోజులు వారాలుగా మారి.. నెలలు అవుతున్నా అతడి ఆరోగ్యం సర్దుకోవటం లేదు. తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి హటాత్తుగా బయటకు వెళ్లిన అతడు.. అనంతరం సీక్రెట్ రూంలో ఉండటం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అతడ్ని వైద్య పరీక్షల అనంతరం.. అవసరమైన మెడికేషన్ పూర్తి చేసి.. అతను బిగ్ బాస్ హౌస్ లో ఆట ఆడటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని వైద్యుల ఖరారు చేసిన తర్వాత.. ఐసోలేషన్ లో భాగంగా అతడ్ని సీక్రెట్ రూంలో ఉంచేశారు.

తదుపరి బిగ్ బాస్ ఆదేశాల వరకు అతడు సీక్రెట్ రూంలోనే ఉండనున్నాడు. ఇదిలా ఉంటే.. జెస్సీకి ఇబ్బందిగా మారిన ఆరోగ్య సమస్య ‘వర్టిగో’గా తరచూ పేర్కొనటం తెలిసిందే. ఇంతకీ.. ఈ సమస్య ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉంటారు?అన్న సందేహాలు పలువురిలో వస్తున్నాయి. వీటికి సమాధానం వెతికినప్పుడు.. జెస్సీ పడుతున్న కష్టం మామూలు కాదన్న విషయం అర్థమవుతుంది.

వర్టిగోను సాధారణ పరిభాషలో చెప్పాలంటే.. తల తిరగటంగా చెప్పాలి. వైద్య భాషలో చెప్పాలంటే డిజీనెస్.. గిదీనెస్.. వర్టిగోగా చెబుతారు. సహజంగా ఈ వ్యాధి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తక్కువగానే పురుషులకు ఎదురయ్యే ఈ వ్యాధితో బాధ పడే వారికి ఎదురయ్యే అవస్థలు అన్ని ఇన్ని కావు. దీని తీవ్రత ఎక్కువగా ఉండే వారు రంగుల రాట్నం మీద తప్పి..అక్కడ నుంచి విసిరేసినట్లుగా ఉంటుంది. కళ్లు తిరుగుతుంటాయి.. బ్యాలెన్స్ తప్పుతుంటారు. గాల్లో తేలినట్లుగా అనిపిస్తూ ఉంటుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. చుట్టూ ఉన్న వారు తిరుగుతున్నట్లుగా.. వస్తువులు సైతం తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వర్టిగో రెండు రకాలుగా వైద్య నిపుణులు చెబుతుంటారు. అందులో ఒకటి సెంట్రల్ వర్టిగో.. రెండోది పెరిఫరల్ వర్టిగో. సెంట్రల్ వర్టిగో లక్ష్మణం ఉన్న వారికి తరచూ తల తిరగటం.. విపరీతంగా వాంతులు కావటం.. సరిగా నడవలేకపోవటం లాంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది
.
పెరిఫరల్ వర్టిగోతో ఇబ్బంది పడేవారు ఒకవైపు తిరిగినప్పుడో.. ఒకవైపు పడుకున్నప్పుడో తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. ఈ సమస్యతో బాధ పడే వారికి చెవిలో ఒక్కోసారి హోరుమని శబ్దం రావటం.. ఒక్కోసారి సడన్ గా వినికిడి శక్తి మందగించటం లాంటి లక్షణాలు కూడా ఎదురవుతుంటాయి.

వైద్యులు ఇచ్చిన మందుల్ని క్రమం తప్పకుండా వాడటం.. వైద్య సలహాలు ఎప్పటికప్పుడు తీసుకోవటం.. తగిన వ్యాయామాలు చేయటం ద్వారా వర్టిగోను అదుపులోకి తీసుకునే వీలుందని చెబుతారు.ఇదంతా చూసినప్పుడు.. ఇంతటి ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటూ.. బిగ్ బాస్ హౌస్ లో టాస్కుల్ని చేధించటం అంత మామూలు విషయం కాదనే చెప్పాలి.
Tags:    

Similar News