లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో రంగు పడింది...

Update: 2019-08-31 05:04 GMT
మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా 40 ఎపిసోడ్లని పూర్తి చేసుకుని శుక్రవారం 41 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. శుక్రవారం ఎపిసోడ్ కొన్ని సరదా సంఘటనలతో పాటు సీరియస్ టాస్క్ లు కూడా జరిగాయి. ఎప్పటిలానే బాబా భాస్కర్ హౌస్ లో సరదాగా అందరి మీద సెటైర్లు వేశారు. తాను కెప్టెన్ అయితే అలా చేస్తా ఇలా చేస్తా అంటూ కామెడీ చేశారు. ఇక ఈ కామెడీ తర్వాత బాబా భాస్కర్ - వరుణ్ - రాహుల్ లకు బిగ్ బాస్ కెప్టెన్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో వరుణ్ విన్ అయ్యి రెండోసారి కెప్టెన్ అయ్యాడు.

ఈ కెప్టెన్ టాస్క్ తర్వాత ఇంటి సభ్యులకు బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ పేరు 'రంగు పడుద్ది' ఈ టాస్క్ ప్రకారం హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న వరుణ్ ని ఓ వీల్ కి కట్టేసి - ఆ వీల్ లో ఉన్న ఐటెమ్ రాసి ఉన్న పేపరుని రంగుబాల్స్‌‌ తో కొట్టాలి. అలా కొట్టిన బాల్ వెళ్లి ఏ ఐటమ్‌ కి తగిలితే ఆ ఐటమ్ లగ్జరీ బడ్జెట్‌ గా వస్తుందని బిగ్ బాస్ ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు. అలాగే ఈ టాస్క్ ముగిశాక..ఛలో ఇండియా టాస్క్ లో విజేతలుగా నిలిచిన బాబా భాస్కర్ - వరుణ్ - రాహుల్ లు తమకు నచ్చిన రెండు వస్తువులని ఎంచుకోవాలని చెప్పారు.

అయితే అందరూ రంగు బాల్స్ పట్టుకుని కొట్టారు.  కానీ మహేశ్ - వితికలు తప్ప అందరూ ఫెయిల్ అయ్యారు. మహేశ్ - వితికలు ఒకో ఐటెమ్ మీద కొట్టారు. ఈ టాస్క్ తర్వాత రాత్రి సమయంలో వితిక - రాహుల్ - హిమజలు మిగతా వారిని భయపెట్టే పని చేశారు. హిమజని బట్టలు కప్పేసి దాచిపెట్టారు. వితిక వెళ్ళి బాబా భాస్కర్ ని హిమజని దాచిపెట్టిన దగ్గరకు తీసుకొచ్చింది. దీంతో బాబా దగ్గరకు రాగానే హిమజ హఠాత్తుగా లేచింది. కానీ బాబా భయపడలేదు. దీంతో హిమజ ప్రయత్నం బిస్కెట్ అయింది.

Tags:    

Similar News