సిట్ కార్యాల‌యానికి బిగ్ బాస్ నిర్వాహ‌కులు?

Update: 2017-07-27 07:28 GMT
ఇప్పుడో ఆస‌క్తిక‌ర వాద‌న వినిపిస్తోంది. డ్ర‌గ్స్ విచార‌ణ కేసులోఅధికారుల నుంచి నోటీసులు అందుకున్న టాలీవుడ్ న‌టి ముమైత్ ఖాన్ ఈ రోజు విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆమెతో పాటు వ‌చ్చిన వారికి సంబంధించిన స‌మాచారం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

సిట్ కార్యాల‌యానికి వాహ‌నంలో వ‌చ్చిన ముమైత్‌ ఖాన్ వెంట‌.. ప్ర‌స్తుతం ఆమె న‌టిస్తున్న బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి చెందిన వారు కూడా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే వారు  త‌మ స‌న్నిహితుల‌ను వెంట తీసుకురావ‌టం.. ఇంత‌కు ముందు విచార‌ణ ఎదుర్కొన్న వారిని చూసినప్పుడు క‌నిపించింది.

అయితే.. ముమైత్ వెంట వ‌చ్చిన వారిలో బిగ్ బాస్ ప్ర‌తినిధులు కూడా ఉన్నార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ప్రిస్టేజ‌స్ ప్రాజెక్టు కావ‌టం.. ఇందులో న‌టించే వారి విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునే బిగ్ బాస్ నిర్వాహ‌కులు.. ముమైత్ విష‌యంలోనూ అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

అయితే.. విచార‌ణ కోసం వ‌చ్చిన ముమైత్ వెంట వారు ఎందుకు వ‌చ్చార‌న్న అంశంపై క్లారిటీ లేద‌నే చెప్పాలి. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. విచార‌ణ కోసం బిగ్ బాస్ షో నుంచి మ‌ధ్య‌లో వ‌చ్చిన ముమైత్ ఖాన్ ద‌గ్గ‌ర ఫోన్ కూడా లేద‌ని.. ఆమె ఫోన్ బిగ్ బాస్ ప్ర‌తినిధుల వ‌ద్దే ఉన్న‌ట్లు చెబుతున్నారు.అందులో నిజానిజాలు ఏమిట‌న్న‌ది తేలాల్సి ఉంది. విచార‌ణ పూర్తి అయి.. బిగ్ బాస్ హౌస్ కి ముమైత్‌ తిరిగి వెళ్లే వ‌ర‌కూ ఆమె వెంట నీడ‌లా బిగ్ బాస్ ప్ర‌తినిధులు ఉంటార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News