బిగ్ బాస్ ను తెలుగు ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. ఇప్పటి వరకు ప్రసారం అయిన అయిదు బిగ్ బాస్ సీజన్ లకు కూడా మంచి ఆధరణ దక్కింది. సీజన్ సీజన్ కు ఆధరణ పెరుగుతున్న నేపథ్యంలో మరింత జోష్ తో బిగ్ బాస్ తెలుగు నిర్వాహకులు ముందడుగులు వేస్తున్నారు. ఇటీవలే హిందీ బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం అయ్యింది. ఉత్తరాదిన ఓటీటీ బిగ్ బాస్ కు కూడా మంచి ఆధరణ దక్కింది. అందుకే ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకు ఓటీటీ వర్షన్ ను తీసుకు వచ్చేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ సందర్బంగా నాగార్జున ఆ విషయాన్ని ప్రకటించడం జరిగింది.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి. నాగార్జున ఓటీటీ వర్షన్ కు కూడా హోస్టింగ్ చేయబోతున్నాడు.
సంక్రాంతికి స్టార్ మా వారు ఓటీటీ బిగ్ బాస్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఓటీటీ బిగ్ బాస్ కు గాను కంటెస్టెంట్స్ ను ఎంపిక చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా సినిమా.. టీవీ మరియు సోషల్ మీడియా రంగానికి చెందిన వారికి షో లో అవకాశం ఇస్తున్నారట. కాని ఈసారి ప్రత్యేక శ్రద్దను సోషల్ మీడియా స్టార్స్ అంటే యూట్యూబ్ ఇన్ స్టా గ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న అమ్మాయిలు మరియు అబ్బాయిల ను ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత సీజన్ ల్లో పాల్గొన్న సోషల్ మీడియా స్టార్స్ వల్ల షో కు మంచి రేటింగ్ వచ్చింది. అందుకే ఇప్పుడు కూడా వారికే మెజార్టీ రోల్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం యూట్యూబ్ లో వందల మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న షార్ట్ ఫిల్మ్ చేసిన ఒక సోషల్ మీడియా స్టార్ ను ఇప్పటికే ఎంపిక చేశారట. అంతే కాకుండా ఇన్ స్టా లో రీల్స్ తో కుమ్మేసే అమ్మాయిలను కూడా ప్రస్తుతం ఆడిషన్స్ చేస్తున్నారట. మొత్తానికి హౌస్ లోకి వెళ్లబోతున్న మొత్తం సభ్యుల్లో సగం మంది వరకు సోషల్ మీడియా సెలబ్రెటీలు ఉంటారని అంటున్నారు. దుర్గారావు వంటి వారు కూడా ఉండే అవకాశం ఉంది.
గతంలో గంగవ్వ కు ఛాన్స్ దక్కింది. కనుక ఈసారి దుర్గారావ్ కు ఛాన్స్ దక్కుతుంది అనడంలో సందేహం లేదు. అయితే పూర్తి సమాచారం షో ప్రారంభం అయిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి మూడో లేదా నాలుగవ ఆదివారం షో ప్రారంభం కాబోతుంది. ఓటీటీ వర్షన్ కు ఓంకార్ అన్నయ్య దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఆయన ఉంటే డ్రామా మస్త్.. ఎంటర్ టైన్ మెంట్ పీక్స్. కనుక బిగ్ బాస్ ఓటీటీ ప్రేక్షకులకు మస్త్ ఎంటర్ టైన్మెంట్ ను ఇస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.