బిబి4 : ఇంటి సభ్యుల తీరుపై ఆగ్రహం.. ఈవారం కెప్టెన్సీ టాస్క్‌ రద్దు

Update: 2020-11-11 04:00 GMT
బిగ్‌ బాస్ ఇంటి 10వ వారం కెప్టెన్‌ ను ఎంపిక చేసేందుకు నిన్న ఆఖరి బంతి అనే టాస్క్‌ ను ఇవ్వడం జరిగింది. మొత్తం 9 మంది ఇంటి సభ్యులు ఉన్నారు. 9 బాల్స్‌ పై 9 మంది కంటెస్టెంట్స్‌ ఫొటోలు అంటించి ఉన్నాయి. ఎవరి బంతిని వారు కాకుండా ఇతరుల బంతిని కంటెస్టెంట్స్‌ వేయాల్సి ఉంటుంది. అంటే తమకు అనుకూలం అనుకున్న వారి బంతిని ముందు వేయాలి లేదా ఎవరినైనా కెప్టెన్‌ అవ్వద్దు అనుకున్న వారి బంతిని తీసుకుని ఆపేసే ప్రయత్నం చేయాలి. అంటే బాస్కెట్‌ లో ఎవరిది ఆఖరి బంతి అవుతుందో వారు టాస్క్‌ నుండి బయటకు వెళ్లి పోతారు. దాంతో వారి బంతి కూడా తొలగిస్తారు. అలా ఒక్కరు ఒక్కరు చొప్పున ఎలిమినేట్‌ అయ్యి చివరకు ఇద్దరు మిగిలితే ఎవరి బంతి బాస్కెట్‌ లో పడుతుందో వారే విజేతలు అంటూ టాస్క్‌ లో ఉంది.

ఈ టాస్క్‌ కాస్త తెలివితో ఆడాల్సినది. ఎవరికి వారు నువ్వు నాది వెయ్యి నేను నీది వేస్తా అంటూ పంచుకున్నారు. దాంతో టాస్క్‌ పెద్దగా ఆసక్తిగా సాగలేదు. తమకు అనుకూలంగా ఉన్న వారి బాల్‌ ను వేసే ప్రయత్నం చేస్తూనే ఇతరులను ఎలిమినేట్‌ అయ్యేలా చేయాలి. కాని ఇంటి సభ్యులు ఆ పాయింట్‌ ను మిస్‌ అయ్యారు. జోడీలు జోడీలుగా బయటకు వచ్చేశారు. చివరకు సోహెల్‌.. అఖిల్‌ మరియు మెహబూబ్‌ నిలిచారు. వీరి ముగ్గురిలో సోహెల్‌ త్యాగం చేశాడు. నేను ఇప్పటికే కెప్టెన్‌ అయ్యాను కనుక మీకు ఆ ఛాన్స్ ఇస్తున్నాను అంటూ తప్పుకున్నాడు.

అఖిల్‌.. మెహబూబ్‌ లు ఎవరు కూడా బాల్‌ వేసేందుకు ఒప్పుకోలేదు. నేను కెప్టెన్‌ అవ్వాలంటే నేను కెప్టెన్‌ అవ్వాలని ఇద్దరు కూడా చాలా సమయం చర్చించుకున్నారు. చివరకు ఎవరి బంతి వారు చేతిలో పట్టుకుని వేసుకునేందుకు సిద్దం అవ్వడంతో బిగ్‌ బాస్ నుండి హెచ్చరిక వచ్చింది. 10వ వారం అయినా కూడా మీకు ఆటపై శ్రద కలగడం లేదు అనిపిస్తుంది. కెప్టెన్సీ ఎవరికి ఆసక్తి లేదనిపించింది. ఇమ్యూనిటీ అక్కర్లేదు అనిపించింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్క్‌ పేపర్‌ లో క్లీయర్‌ గా ఎవరి బంతి వారు తీసుకోకూడదు అంటూ చెప్పినా వారు తీసుకోవడం జరిగింది. మీరు చేసిన పనితో టాస్క్‌ అంతా వృదా అయ్యింది. కనుక తక్షణమే ఈ టాస్క్‌ ను రద్దు చేస్తు నిర్ణయం తీసుకుంటున్నట్లుగా చెప్పాడు.

ఈ వారం ఇంటికి కెప్టెన్‌ ఎవరు ఉండరు అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు. దాంతో అఖిల్‌ చాలా కోపం తెచ్చుకున్నాడు. ఇక్కడ ఫ్రెండ్‌ అంటూ ఎదవ నాటకాలు ఆడుతారు కాని ఎవరు కూడా సాయం చేరు. నేను ఇప్పటి వరకు ప్రతిది ఒక్కడినే చేసుకుంటూ వచ్చాను. నాకు ఒక్క సారి సాయం చేస్తే ఏం అయ్యింది అంటూ అఖిల్‌ నానా రచ్చ చేశాడు. మెహబూబ్‌ సైలెంట్‌ గా కన్నీరు పెట్టుకున్నాడు. సోహెల్‌ కూడా తాను వదిలేయకుండా ఉంటే బాగుండేదేమో అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తానికి కెప్టెన్సీ టాస్క్‌ రచ్చ రచ్చ అయ్యింది. ఇక నిన్నటి ఎపిసోడ్‌ చివర్లో అర్థరాత్రి సమయంలో ఇంటి సభ్యులు అంతా తమ సూట్‌ కేసులు సర్దుకుని గార్డెన్‌ ఏరియాలో నిల్చోవాల్సిందిగా బిగ్‌ బాస్ ఆదేశించాడు. ఏం జరుగబోతుంది అనేది నేటి ఎపిసోడ్‌ లో తెలియనుంది.
Tags:    

Similar News