అన్నీ అనుకున్నట్టుగా సాగితే.. ఈ నెలలో బిగ్ బాస్ సీజన్ మొదలు కావాల్సింది. కానీ.. కరోనా సెకండ్ వేవ్ కొట్టిన దెబ్బకు సినిమా ఇండస్ట్రీ మొదలు.. బిగ్ బాస్ షో దాకా అన్నిటికీ షట్టర్ దించేయాల్సిన పరిస్థితి. నిన్నా మొన్నటి వరకు ఈ ఏడాది సీజన్-5 లేనట్టే అనే ప్రచారం కూడా సాగింది. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ షో ఉంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పడుతోంది. త్వరలో షూటింగులు కూడా ఓపెన్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. బిగ్ బాస్ ను షూట్ చేయడం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. కంటిస్టెంట్లను వెతకడమే పెద్ద టాస్క్. ఆ తర్వాత వాళ్లను పిలిచి ఆడిషన్స్ నిర్వహించాలి. మూడు నెలలు హౌస్ లో ఉండడానికి కావాల్సిన ట్రెయినింగ్ ఇవ్వాలి. బిగ్ బాస్ హౌస్ సెట్టింగ్ వేయాలి. ఇలా.. చాలా అంశాలు ముడిపడి ఉంటాయి.
ఇవన్నీ రాబోయే రెండు నెలల్లో ఫినిష్ చేసి.. షోను స్టార్ట్ చేయాలని చూస్తోందట స్టార్ మా యాజమాన్యం. అంటే.. జూలై, ఆగస్టులో పనులన్నీ సిద్ధం చేసుకొని.. సెప్టెంబరులో షో మొదలు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, షో హోస్టుగా మళ్లీ నాగార్జుననే ఫైనల్ చేసినట్టు సమాచారం.
తన అప్ కమింగ్ సినిమాలకు సంబంధించి విదేశాల్లో, బయటి లొకేషన్లలో తీసే సన్నివేశాలను సెప్టెంబరు కన్నా ముందుగానే ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేస్తారట. ఆ తర్వాత మొత్తం హైదరాబాద్ ను సెంట్రలైజ్ చేసి.. ఇటు బిగ్ బాస్ సీజన్ ను, అటు సినిమా షూటింగులను ఏక కాలంలో లాంగిచేయాలని అనుకుంటున్నారట. మరికొన్ని రోజులు ఆగితే.. మరింత క్లారిటీ వస్తుంది.