BiggBoss5 : ముగింపు ముందు వైల్డ్ ఎంట్రీ ఎంటి బాసు?

Update: 2021-11-07 09:30 GMT
తెలుగు బిగ్‌ బాస్ దాదాపుగా పది వారాలు ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటి వరకు 75 శాతం వరకు బిగ్ బాస్ సీజన్ 5 పూర్తి అయినట్లే. ఈ సమయంలో వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ గురించిన చర్చ రావడం ఆశ్చర్యంగా ఉంది. సాదారణంగా బిగ్ బాస్ ప్రారంభం అయిన రెండు మూడు వారాల నుండి వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ గురించిన చర్చ మొదలు అవుతుంది. కాని ఈ సీజన్‌ లో ఇప్పటి వరకు కూడా ఇంకా వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ గురించి ప్రచారం జరగడం విడ్డూరంగా ఉంది అంటున్నారు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అనేది ఖచ్చితంగా ప్రతి సీజన్ లో ఉంటుంది. కాని ఈసారి మాత్రం ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేకపోవడంతో ఇక ఉండదని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా చివరి వారాల్లో వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చే విషయమై చర్చలు జరుగుతున్నాయంటున్నారు.

వచ్చే వారంలో బిగ్‌ బాస్ హౌస్‌ లో కొత్త కంటెస్టెంట్‌ ఉంటాడు అనే బలమైన వార్తలు బుల్లి తెర వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒక అమ్మాయి ఇప్పటికే క్వారెంటైన్ లో ఉందని అంటున్నారు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన వారికి ఖచ్చితంగా ప్రేక్షకుల వద్ద సింపథి తక్కువ ఉంటుంది. ఇంటి సభ్యులు కూడా వైల్డ్ ఎంట్రీగా వచ్చిన వారి విషయంలో ఇంట్రెస్ట్‌ గా ఉండరు. రెండు మూడు వారాల తర్వాత వచ్చిన వారిపైనే కొందరు టార్గెట్‌ చేస్తూ ఉంటారు. అలాంటి సీజన్‌ ముగింపు దశలో వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ పై ఖచ్చితంగా జనాల్లో కూడా వ్యతిరేకత ఉంటుంది. ఆ కంటెస్టెంట్‌ ను రెండు మూడు వారాలు ఉన్నా పర్వాలేదు అన్నట్లుగా నిర్వాహకులు పంపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్ జాబితాలో నేడు విశ్వ కూడా చేరబోతున్నాడు. విశ్వ ఎలిమినేట్‌ అయ్యాడు అని ఇప్పటికే లీక్ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5 లో ప్రత్యేకంగా కంటెస్టెంట్స్ చేస్తున్నది ఏమీ లేదు.. అందుకే నిర్వాహకులు ఈ సమయంలో వైల్డ్‌ కార్డ్‌ ను ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకే సారి ఇద్దరు వైల్డ్‌ కార్డులను ప్రవేశ పెడితే మరింతగా ఆట రసవత్తరంగా మారుతుందని అంటున్నారు. బిగ్ బాస్ క్రియేటివ్ టీమ్ ఈ సమయంలో అయినా షో రేటింగ్ ను పెంచేందుకు కాస్త మసాలా యాడ్‌ చేసే విధంగా వైల్డ్‌ ఎంట్రీని పంపించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:    

Similar News