2022 లో KGF2 త‌ర్వాత మ‌రో భారీ యాక్ష‌న్ చిత్రమిదే!

Update: 2022-04-07 03:30 GMT
య‌ష్ - సంజ‌య్ ద‌త్ లాంటి భారీ తారాగ‌ణంతో KGF2 దూసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుద‌ల‌వుతోంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ యాక్ష‌న్ మూవీ ఇది. దేశవ్యాప్తంగా ప‌లు భాష‌ల్లో అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది. అయితే ఈ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజులో యాక్ష‌న్ సినిమా ఏదైనా ఉందా? అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కూ దానిపై చ‌ర్చ లేదు.

తాజా స‌మాచారం మేర‌కు.. టైగర్ ష్రాఫ్ నటించిన హీరోపంతి 2 ఇదే త‌ర‌హా ట్రీటివ్వ‌నుంద‌ని తెలిసింది. ఈ మూవీ కోసం సాజిద్ నదియాడ్ వాలా అతిపెద్ద యాక్షన్ డైరెక్టర్ లను ఎంపిక చేసుకుని యాక్ష‌న్ పార్ట్ ని ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దుతున్నార‌ని తెలిసింది. నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా- దర్శకుడు అహ్మద్ ఖాన్ .. భారతదేశపు యువ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ తో క‌లిసి ప‌ని చేయ‌డ‌మే బిగ్ స‌క్సెస్ అన్న అంచ‌నా ఉంది. భారీ యాక్షన్ ఎంటర్ టైన‌ర్ జానర్ విషయానికి వస్తే తిరుగులేని త్రయం అని మళ్లీ మళ్లీ నిరూపించారు వీరంతా.

టైగర్ ష్రాఫ్ నటించిన హీరోపంతి 2 కోసం సాజిద్ నడియాడ్ వాలా అతిపెద్ద యాక్షన్ డైరెక్టర్‌లను ఎంపిక చేయ‌డంతో మూవీ మునుపెన్నడూ లేని స్పెష‌ల్ ట్రీటిస్తుంద‌ని అంచ‌నా ఏర్ప‌డింది. యాక్షన్ ప‌రంగా హద్దులు చెరిపేయ‌డం ఖాయమ‌న్న చ‌ర్చా సాగుతోంది.  సాజిద్ నడియాడ్ వాలా స్టార్‌షిప్ ట్రూపర్స్ ప్ర‌ముఖ సంస్థ‌ల‌తో క‌లిసి భారీ బ‌డ్జెట్ ని వెచ్చించారు.

ఇందులో తారాగ‌ణం ఆస‌క్తిక‌రం. ఆమె ఫేమ్ మో ఫైసల్ - బ్రహ్మాస్త్ర మరియు వార్ చిత్రాల్లో న‌టించిన‌ పర్వేజ్ షేక్... బాఘీ 2 .. బాఘీ 3 ఫేమ్ కెచా ఖంఫాక్డీ .. చైత్రదా చంద్రమ ఫేమ్ రామ్ లక్ష్మణ్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలకు పని చేస్తున్నారు. దీంతో హీరోపంతి 2లో యాక్ష‌న్ ఏ లెవ‌ల్లో ఉంటుందోనన్న అంచ‌నాలు ఎగ్జ‌యిట్ చేస్తున్నాయి.

భాఘీ 2 - బాఘీ 3 వంటి చిత్రాల తర్వాత ఈ ముగ్గురూ ఇప్పుడు హీరోపంతి 2తో యాక్ష‌న్ ప‌రంగా కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయాలని చూస్తున్నారు. ఈసారి బ్లాక్ బస్టర్ సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో నిర్మించారు. వారి అసాధారణమైన - అత్యాధునికమైన నైపుణ్యంతో అతిపెద్ద యాక్షన్ దర్శకులను ఎంపిక చేయడం ద్వారా ప్రేక్షకుల మైండ్ లో తదుపరి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ ను అందించాల‌న్న ప్ర‌య‌త్నం ఇద‌ని తెలుస్తోంది.

రజత్ అరోరా ఈ సినిమాకి ర‌చ‌యిత‌. A R రెహమాన్ సంగీతం అందించారు. హీరోపంతి 2కి అహ్మద్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. టైగర్ చివరి విడుదలైన బాఘీ 3కి అత‌డు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈద్ పండుగ సందర్భంగా 29 ఏప్రిల్ 2022న థియేటర్లలో విడుదల కానుంది.
Tags:    

Similar News