రెండు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల రైట్స్ దక్కించుకున్న దిగ్గజ ఓటీటీ..!
ఓటీటీల హవా మొదలయ్యాక వీక్షకులను ఆకట్టుకోవడానికి స్ట్రీమింగ్ దిగ్గజాలు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. సబ్ స్క్రైబర్స్ ను పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ను అందించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటిలో ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'జీ5' కూడా ఒకటి.
తెలుగు ప్రేక్షకులను అలరించడానికి జీ 5 సంస్థ.. సరికొత్త సినిమాలు - ఒరిజినల్ వెబ్ సిరీస్ లతోపాటుగా డైరెక్ట్ ఓటీటీ రిలీజులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలో సొంతంగా నిర్మించే సినిమాలతో పాటుగా పలు క్రేజీ మూవీస్ ని కొనుగోలు చేస్తోంది. జీ5 ఓటీటీ ని సౌత్ లో బలోపేతం చేసేందుకు భారీగా ఖర్చు చేస్తోందని టాక్.
యావత్ సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా డిజిటల్ రైట్స్ ఇప్పుడు జీ గ్రూప్ వద్దే ఉన్నాయి. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకి చెందిన డిజిటల్ హక్కులను దక్కించుకుంది జీ5. దీని కోసం భారీ ధర చెల్లించినట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - షో మ్యాన్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'RC15' సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులకు కూడా జీ స్టూడియోస్ వారు చేజిక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇతర సంస్థలతో పోటీపడి మరీ ఫ్యాన్సీ రేటుకు ఈ రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది.
శంకర్ - చరణ్ వంటి అరుదైన కాంబోలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న RC15 పై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా నిర్మాణంలో జీ స్టూడియోస్ కూడా భాగమైంది. ఇందుకు గాను ఈ సినిమాకి సంబంధించిన అన్ని భాషల శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకోనున్నారని సమాచారం.
దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ నాన్-థియేట్రికల్ రైట్స్ అన్నిటిని జీ స్టూడియోస్ కి ఇచ్చేసి.. అన్ని భాషల థియేట్రికల్ హక్కులను మాత్రం తన దగ్గరే ఉంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ - శంకర్ ల సినిమా 2023 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ క్రమంలో జీ5 ఓటీటీలోకి రానుంది.
గతంలో చెర్రీ హీరోగా నటించిన 'బ్రూస్లీ' సినిమా రైట్స్ జీ గ్రూప్ వద్దే ఉండగా.. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' 'Rc15' వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల హక్కులను కైవసం చేసుకోవడం గమనార్హం. ఈ రెండు ప్రతిష్టాత్మక సినిమాలు ఓటీటీ జీ స్టూడియోస్ కు మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయని భావించవచ్చు.
ఇకపోతే బాలీవుడ్ లో వందల కోట్ల పెట్టుబడి పెట్టే జీ సంస్థ.. ఇప్పుడు సౌత్ సినిమాల మీద ప్రత్యేక శ్రద్దతో భారీగా పెట్టుబడులు పెడుతోందని సమాచారం. సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న 'బంగార్రాజు' సినిమాని జీ స్టూడియోస్ వారు సమర్పించిన సంగతి తెలిసిందే.
అలానే అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి రూపొందించిన 'లూజర్' సీజన్-2 వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మరిన్ని క్రేజీ సినిమాలను కొనుగోలు చేయడానికి.. నిర్మాణంలో భాగస్వాములు అవడానికి జీ 5 చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.