తమిళ సూపర్ స్టార్ విజయ్ డబుల్ రోల్ పోషించిన 'బిగిల్' చిత్రం అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అట్లీ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటించింది. విజయ్ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో జోరుమీదున్నాడు. దాంతో పాటు నయనతార కూడా ప్రస్తుతం తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా దూసుకు పోతుంది. క్రేజీ స్టార్స్ నటించిన బిగిల్ కు తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా మంచి బజ్ ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ.140 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లో భారీ మొత్తానికి అమ్ముడు పోయినట్లుగా సమాచారం అందుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం మంచి బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో విజయ్ నటించిన ప్రతి సినిమా కూడా 100 కోట్లను మించి వసూళ్లు నమోదు చేస్తున్నాయి. అందుకే ఈ చిత్రం భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
200 కోట్ల వసూళ్లను ఈ చిత్రం రాబట్టడం ఖాయం అంటూ విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు రెండు మిలియన్ ల యూట్యూబ్ లైక్స్ వచ్చాయి. సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో విజయ్ తమిళ సినీ రికార్డులన్నీంటిని బ్రేక్ చేయడం ఖాయం అంటు ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.