సుశాంత్ కేసులో బీహార్ డీజీపీ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-08-12 13:00 GMT
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పుడు రాజకీయం అంశంగా మారిపోయిందా అంటే ఔననే అంటున్నాడు బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే. సుశాంత్ మరణాన్ని రాజకీయం చేయడంతో ఇప్పుడు ఎటూ తేలకుండా ఇన్ని మలుపులు తిరుగుతోందని.. అందుకే జాప్యం జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజానికి సుశాంత్ తండ్రి తమ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేయడంతో తాము నలుగురు పోలీసుల బృందాన్ని పాట్నా నుంచి ముంబైకి పంపించామని.. కానీ వారం రోజుల వరకు కూడా అక్కడి పోలీసుల్లో ఎవరూ అసలు ఇది ఏ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుందో చెప్పలేదని విమర్శించారు. పైగా మా ఎస్పీని బలవంతంగా క్వారంటైన్ కు తరలించారని ఆరోపించారు.

సుశాంత్ కేసులో లీగల్ సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీ గానీ తమ వద్ద లేవని బీహార్ డీజీపీ తెలిపారు.

సుశాంత్ కేసును బీహార్ పోలీసులు విచారించడాన్ని ముంబై పోలీసులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో బీహార్ వర్సెస్ ముంబై పాలిటిక్స్ ఎంటర్ అయ్యాయి. బీజేపీ నేతలు ఇది ముమ్మాటికీ సుశాంత్ ది హత్యనేని అంటున్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
Tags:    

Similar News