హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సింగర్.. నిర్మాత అయిన సెలెనా గోమెజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంది. తాను నటించిన ది డెడ్ డోంట్ డై అనే సినిమా స్క్రీనింగ్ కు హాజరయ్యింది. ఈ సందర్బంగా ఆమె తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఇది నాకు తొలి కేన్స్ ఎంట్రీ. ఇది నాకు అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను జిమ్.. బిల్ ముర్రేతో కలిసి నటించాను. వారితో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే సమయంలో తాను బిల్ ముర్రేను వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రకటించింది.
ఈ ప్రకటన సెలెనా గోమెజ్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా అందరు కూడా ఆమె ప్రకటనకు అవాక్కవుతున్నారు. వారు అంతగా అవాక్కవ్వడానికి కారణం బిల్ ముర్రే వయస్సు ఏ 30 లేదా 40 సంవత్సరాలు కాదు ఆయన వయసు 68 ఏళ్లు. 26 ఏళ్ల సెలనా తన తాత వయసు కంటే ఎక్కువగానే ఉన్న వ్యక్తి ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఒక అభిమాని సెలెనా ఇన్ స్టా పోస్ట్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముర్రె చనిపోయి చాలా కాలం అయ్యిందనుకుంటున్నాను. ఆయన ఇంకా బతికే ఉన్నాడా. ఆయన్ను నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావ్.. ఒకవేళ నువ్వు ఆయన్ను పెళ్లి చేసుకుంటే నేను నా స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాం అంటూ బెదిరించాడు. మరి కొందరు డబ్బు కోసం సెలెనా ఈ పని చేస్తుందని విమర్శించారు. మొత్తానికి సెలెనా తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.