టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఈ శుక్రవారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 'బింబిసార' - 'సీతా రామం' వంటి చిత్రాలు మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి.
గత కొన్ని వారాలుగా రిలీజైన ఏ తెలుగు సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో.. అందరూ ఈ రెండింటిపైనే హోప్స్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో 'సీతా రామం' మరియు 'బింబిసార' సినిమాల వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సోసియో ఫాంటసీ యాక్షన్ మూవీ ''బింబిసార''. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వశిష్ట అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో హరికృష్ణ నిర్మించారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్
చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో 'బింబిసార' కు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అవసరమైంది. అయితే ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే పెద్ద సినిమా. ఈ సినిమాపై నెలకొన్న అంచనాల దృష్ట్యా.. నాన్ రిఫండల్ అడ్వాన్స్ ఆధారంగా డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేసారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ప్రపంచవ్యాప్తంగా 'బింబిసార' సినిమాకు రూ.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. నైజాం 4 కోట్లు - సీడెడ్ 2.5 కోట్లు - ఆంధ్రా 6.5 కోట్లు - రెస్టాఫ్ ఇండియా 1 కోటి - ఓవర్సీస్ 1 కోటికి ఈ సినిమాని తీసుకున్నట్లు తెలుస్తోంది.
'సీతా రామం' విషయానికొస్తే.. దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ - రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఇది. దీనికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించారు. తెలుగు తమిళ మలయాళం భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.
స్టార్ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో 'సీతా రామం' సినిమాని నిర్మించారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఏరియా వైజ్ థియేట్రికల్ రైట్స్ విలువ చూసుకుంటే.. నైజాం 4 కోట్లు - సీడెడ్ 2 కోట్లు - ఆంధ్రా 6కోట్లు - రెస్టాఫ్ ఇండియా 1 కోటి - ఓవర్సీస్ 1 కోటితో 14 కోట్ల వరకూ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
'బింబిసార' & 'సీతా రామం' సినిమాలకు దాదాపు ఒకే విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెండు చిత్రాలకూ మంచి బజ్ క్రియేట్ అయింది. మరి రెండింటిలో ఏది ప్రేక్షకాదరణ పొందుతుంది? బాక్సాఫీస్ వద్ద ఏ మూవీ విజేతగా నిలుస్తుంది? రెండూ మంచి విజయాలు అందుకుంటాయా? అనేది వేచి చూడాలి.