20 ఏళ్ల వ‌య‌సులో ఆర్జీవీ రౌడీయిజం?

Update: 2020-09-17 01:30 GMT
వెండితెర‌పై వ‌ర్మ ఓ సంచ‌ల‌నం.. హాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ సినిమాల స్ఫూర్తితో భూత్‌.. రాత్రి లాంటి సినిమాలు తీసినా `గాడ్ ఫాద‌ర్‌` ఫార్ములాని న‌మ్మి అదే ఫార్ములాతో గ్యాంగ్ స్ట‌ర్ సినిమాల‌కు భార‌తీయ తెర‌పై ప్రాణ ప్ర‌తిష్ట చేసి సిల్వ‌ర్ స్క్రీన్‌ పై సంచ‌ల‌నం సృష్టించారు. కాంట్ర వ‌ర్శీల‌తో బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లోనూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యారు. మాఫియా సినిమాల‌కి కేరాఫ్ అడ్ర‌స్ ‌గా నిలిచిన వ‌ర్మ‌పై `రాము` పేరుతో బ‌యోపిక్ మొద‌లైంది.

మూడు భాగాలుగా ఈ బ‌యోపిక్ ‌ని నిర్మిస్తున్నారు. బ‌య‌టికి దీన్ని వేరే ద‌ర్శ‌కుడు తెర‌పైకి తీసుకొస్తున్నా తెర‌వెనుక మాత్రం క‌ర్త క‌ర్మ క్రియ వ‌ర్మ‌నే. ఇందులో తొలి భాగం అంతా 20 ఏళ్ల వ‌య‌సులో వ‌ర్మ ఏం చేశాడు? ఎలా రౌడీయిజం వైపు అడుగులు వేశాడు. అది `శివ‌` అంకురార్ప‌ణ‌కు ఎలా కార‌ణ‌మైంది అన్న కోణంలో సాగుతుంద‌ట‌. ఇంత‌కీ అస‌లు వ‌ర్మ 20 ఏళ్ల వ‌య‌సులో ఏం చేశాడు?. అప్ప‌టికి ద‌ర్శ‌కుడ‌వ్వాల‌ని క‌ల‌గ‌న్నాడా? .. లేదా?..

బ్రూస్‌ లీ స్పూర్తితో క‌రాటే నేర్చుకున్నాడు. ఆ త‌రువాత రౌడీయిజం వైపు ఆక‌ర్షితుడై రౌడీయిజం మొద‌లుపెట్టాడు. పంజా గుట్ట‌లో వ‌డియో లైబ్రైరీ న‌డిపించాడు. అక్క‌డే అత‌ని మైండ్ సినిమా వైపు మ‌ళ్లింది. హాలీవుడ్ సినిమాలు చూస్తూ సినీ రంగంలోకి ఎంట‌ర‌వ్వాల‌నుకున్నాడు. తండ్రి సౌండ్ ఇంజినీర్ కావ‌డంతో వ‌ర్మ‌కు ఇండ‌స్ట్రీ ఎంట్రీ చాలా ఈజీగా జ‌రిగిపోయింది. అన్న‌పూర్ణ కాంపౌండ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన వ‌ర్మ అక్క‌డే నాగార్జుకు, అక్కినేని వెంక‌ట్‌ ల‌కు ద‌గ్గ‌ర‌య్యార‌ట‌. ఆ స‌మ‌యంలోనే ఇంగ్లీష్ నావెల్స్ చ‌దివిన టాలెంట్ వుండ‌టం, ఆ రోజుల్లో ఫ్లూయెంట్ ‌గా ఇంగ్లీష్ మాట్లాడ‌టంతో వ‌ర్మ ప‌ని చాలా ఈజీ అయిపోయింది. సైకాల‌జీ బుక్స్ చ‌దివిన తెలివితో త‌న మాస్ట‌ర్ బుర్క‌కు ప‌దును పెట్టి `శివ‌` సినిమాతో డైరెక్ట‌ర్ ‌గా ఓన‌మాలు తెలియ‌కుండానే శివ‌నాగేశ్వ‌రార‌వు స‌హా‌యంతో డైరెక్ట‌ర్ అయిపోయాడు వ‌ర్మ‌. ఆ త‌రువాత రాము తీసిన `శివ‌` ట్రెం్ సెట్ట‌ర్ కావ‌డం దేశ వ్యాప్తంగా వ‌ర్మ పేరు మారు మ్రోగ‌డం తెలిసిందే.
Tags:    

Similar News