ర్యాంప్ వాక్ ఎగ్గొట్టి భర్తతో ఎంజాయ్ చేసిన బిపాషా

Update: 2017-03-08 08:25 GMT
ముదురు హీరోయిన్ బిపాషా బసుపై లండన్ కు చెందిన ఓ సంస్థ మండిపడుతోంది. బిపాషా తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిందని.. తమకు కమిటైనప్పటికీ రాకుండా భర్తతో హానీమూన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లిపోయిందని ఆరోపిస్తూ కోర్టుకెక్కుతోంది.
    
నాలుగు రోజుల కిందట లండన్ లో ‘‘ఇండియా పాకిస్థాన్ లండన్ ఫ్యాషన్ షో’’లో పాల్గొనేందుకు భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బిపాషా బసు లండన్ వెళ్లింది. అక్కడి గిబ్సన్ హాల్ లో నిర్వహించే గ్రాండ్ ఫినాలెలో బిపాషా షో ఉంటుందని నిర్వాహకులు ముందునుంచి ప్రచారం చేశారు. అందుకోసమే ఒప్పందం చేసుకుని బిపాషాను తీసుకెళ్లారట. కానీ... షోకు నాలుగు గంటల ముందు బిపాషా నో చెప్పిందట. హోటల్ రూం నుంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడలేదట. చివరకు తన  మేనేజర్ సనా కపూర్ నచ్చజెప్పడానికి చూసినా కూడా ఆమెను తిట్టి పంపించిందట. దీంతో నిర్వాహకురాలు గుర్బని కౌర్.. బిపాషాను బతిమలాడడానికి వెళ్లగా ఆమె ముఖాన తలుపు వేసేసిందట.
    
లండన్ షో కోసం పిలిచినప్పుడే ఆమె అక్కడ తన భర్తతో గడిపేందుకు ప్లాన్ చేసుకుందని.. తమ షో అవసరాలకు మించి మరో అయిదు రాత్రులు అక్కడ ఉంటానని కోరడంతో తాము హోటల్ బుక్ చేశామని.. కానీ.. తొలుత తాము బుక్ చేసిన హోటళ్లోనే అదనపు రోజులకు గదులు ఖాళీగా లేకపోవడంతో మరో టాప్ రేటెడ్ హోటళ్లో బుక్ చేశామని.. ఆమె రాగానే లోకల్ సిమ్ లు రెండు ఇచ్చామని.. ఇన్ని చేసినా ఆమె చివర్రో హ్యాండిచ్చి హోటల్ గదిలో తన భర్తతో కలిసి ఎంజాయ్ చేసిందే కానీ, బయటకు రాలేదని వారు ఆరోపించారు.  ఈ విధంగా తమ సొమ్ముతో ఆమె హనీమూన్ చేసుకుందని కూడా నిర్వాహకులు వ్యాఖ్యానించారు. దీనిపై తాము చట్టబద్ధంగా పోరాడతామని వారు అంటున్నారు.
    
అయితే.. బిపాసా మాత్రం ఇదంతా తప్పుడు ఆరోపణ అని కొట్టిపారేస్తోంది.  ఎవరో కొందరు తనకు నీతులు చెబుతున్నారని.. అయితే.. తను పదిహేనేళ్లు ఇలాంటి ఫీల్డులో ఉన్నానని.. ఎక్కడా, ఎవ్వరికీ ట్రబులివ్వలేదని, వర్క్ ఎథిక్స్ గురించి ఎవరో చెబితే నేర్చుకునే స్థితిలో లేనని బిపాసా వాదిస్తోంది. మరి ఎవరి వాదనలు వారికున్నాయి.. అసలు కథేంటో ముందుముందు తెలియాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News