ఫోటో స్టోరి: ఈ ఫోటో నిజమేనంటారా?

Update: 2017-02-28 04:16 GMT
ఇప్పుడు ఏ ఫోటో నిజమో ఏ ఫోటోను ఫోటో షాపులో తెగ షాపింగ్ చేయించేశారో చెప్పడం కష్టమైపోతోంది. అప్పట్లో కాజల్ అగర్వాల్ వంటి భామలు నిజమైన ఫోటోలను కూడా ఫోటోషాపులో చేశారని ప్రచారం చేసుకుంటే.. ఇప్పుడు ఫోటోషాప్ ఫోటోలను కూడా నిజమైనా ఫోటేలే అంటూ దింపేస్తున్నారు కొందరు. ఈ సీనియర్ హీరోయిన్ కూడా అదే చేస్తోందా అనే సందేహం వస్తోంది.

స్ర్టాంగ్ ఈజ్ సెక్సీ అంటూ బెంగాళీ బుల్లెమ్మ బిపాషా బసు అదిగో అలా ''హెల్త్'' మ్యాగజైన్ కు ఫోజులిచ్చింది. అయితే ఈ ఫోటోలో చూస్తున్న బక్కటి బిపాషా బసుకు.. ఇప్పుడు కనిపిస్తున్న బిపాషాకూ పెద్దగా పోలికలు ఏమీ కనిపించట్లేదు. కాని అమ్మడు మాత్రం నేను ఇంత ఫిట్ గా ఉన్నాను అంటూ రాగాలూ దీర్ఘాలు తీస్తోందిలే. ఇంతకీ ఈ ఫోటో నిజమేనంటారా? లేకపోతే ఫోటోషాప్ వారు ఇలా చెక్కేశారా??

ఇకపోతే పెళ్లయినప్పటినుండి చేతిలో పెద్దగా సినిమాల్లేక ఖాళీగానే ఉంటోంది బిప్స్. ఎందుకో తెలియదు కాని.. అసలు ఆఫర్లు మాత్రం ఈమెవైపు కనీసం మాత్రంగానైనా చూడట్లేదు. పక్కనుండి తలొంచుకుని వెళ్ళిపోతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News