2022లో అడుగుపెట్టే ముందే RRR ట్రీట్ ఒక ఎత్తు అనుకుంటే.. పుష్ప ట్రీట్ మరో ఎత్తు. మరి వీటన్నిటినీ మించినది ఇంకోటి ఏదైనా ఉందా? అంటూ జనం వెతుకుతున్నారు. ఎందుకు లేదు.. భీమ్లా నాయక్ ఉన్నాడుగా.. పండక్కి వచ్చేస్తున్నాడు ధీమాగా. ఈనెల 17 నుంచి పుష్ప ట్రీట్ స్టార్టయితే జనవరి మొదటివారంలోనే ఆర్.ఆర్.ఆర్ ట్రీట్ స్టార్టవుతుంది థియేటర్లలో. ఇక సంక్రాంతికి ముందు భీమ్లా నాయక్ రయ్ మంటూ దూసుకొచ్చేస్తున్నాడు.
ముగ్గురిలో ఎవరి ప్రత్యేకత వారికి ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న భీమ్లా నాయక్ జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే భీమ్లా నాయక్ (పవన్).. డేనియల్ శేఖర్ (రానా) పోస్టర్లు మోషన్ టీజర్లు అంతర్జాలంలో అగ్గి రాజేశాయి. ఈ సినిమాలో ప్రతి పాత్రా దేనికదే ప్రత్యేకం.
నేడు దగ్గుబాటి రానా బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ భీమ్లా నాయక్ టీమ్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్లో నే జనవరి 12 రిలీజ్ అంటూ ఖాయం చేసేయడంతో మరోసారి పూర్తి క్లారిటీ వచ్చినట్టయ్యింది. ఇక రానా .. పవన్ అభిమానులు సంబరాలు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా? అంటూ హోరాహోరీ ఖాయమైంది. భీమ్లా నాయక్ విడుదల వాయిదా పడుతుంది! అంటూ సాగిన ప్రచారం నిజం కాదని ప్రూవైంది. మేకర్స్ పూర్తి క్లారిటీతో ఉన్నారని అర్థమవుతోంది.
ఆర్.ఆర్.ఆర్- రాధేశ్యామ్ లతో పోటీపడుతూ భీమ్లా నాయక్ బరిలో దిగిపోతున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ పర్యవేక్షకుడు. ఆయనే మాటలందించారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషియమ్ కి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసినదే.