బాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రౌనత్. బీజేపీ ప్రోద్బలంతో ఆమె బాలీవుడ్ హీరోలపై సాగించే సంకుల సమరం ఇప్పటికీ కొనసాగుతోంది. హిందుత్వ వ్యతిరేకులపై విరుచుకుపడే కంగనా నోట్లో నోరు పెట్టేందుకు ఎవరూ సాహసించారు. ఏదైనా విషయం ఉండనీ ముఖం మీదనే మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంది కంగనా.. సినిమాల కంటే కూడా వివాదాలతోనే కంగనా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.
బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మరణం తర్వాత.. బాలీవుడ్ లోని బంధుప్రీతి, రాజకీయాలు, సినిమాల విషయంలో పక్షపాతంపైకంగనా ఏకిపాడేశారు. పలువురు బాలీవుడ్ దర్శక నిర్మాతలను కడిగిపారేశారు.
ఇటీవల కంగనా తమిళనాడులోని మధురైలోని బాంకే బిహారి ఆలయాన్ని కుటుంబంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తానని.. అది కూడా మధురై నుంచి పోటీచేస్తానని చెప్పుకొచ్చింది. రాజకీయాల గురించి కంగన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజాగా మధురలోని ఆలయాన్ని బాలీవుడ్ నటి హేమమాలిని సందర్శించారు. ఈమె మీడియాతో మాట్లాడుతూ కంగనా రాజకీయ ఎంట్రీపై వ్యాఖ్యానించింది. 'ఆ వ్యాఖ్యలపై నేనేం మాట్లాడలేను. కానీ శ్రీకృష్ణుడు చూసుకుంటాడు.
ప్రజలకు ఇక్కడి వ్యక్తిని ఎన్నుకోవడం ఇష్టం లేదేమో.. సినీ నటి కావాలి. తర్వాత రాఖీ సావంత్ కూడా ఎన్నికల్లో పోటీచేయాలనుకున్నా ఆశ్చర్యం లేదు' అని వెటకారంగా హేమమాలిని చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కంగనాను ఐటెం బాంబ్ రాఖీ సావంత్ తో పోల్చి ఎద్దేవా చేసేసింది హేమమాలిని.
మరి ఫైర్ బ్రాండ్ అయిన కంగనా రౌనత్ దీనిపై ఊరుకునే రకం కాదు. ఆమె ఖచ్చితంగా హేమమాలినిపై విరుచుకుపడడం ఖాయం. ఎవరైనా ఏమీ అనకుండానే తిట్టేసే కంగనా.. ఇంత మాట అన్నాక హేమమాలిని ఊరికే వదలదు. ఆమె కౌంటర్స్ కోసం ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు.
కంగనా రౌనత్ ప్రస్తుతం 'టికు వెడ్స్ షేరు'తో బిజీగా ఉంది. ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. 'ఎమర్జెన్సీ'లో ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View
Full View Full View Full View Full View