మన సినిమాలకు ప్రతీ సీజన్ లోనూ హాలీవుడ్ అనువాద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బిగ్ షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. దీపావళి సీజన్ లోనూ క్రేజీ హాలీవుడ్ సినిమా ధాటికి మన సినిమాలకు తీవ్రస్థాయలో బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. దీపావళి పండగ సీజన్ కావడంతో నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఇందులో రెండు స్ట్రెయిట్ సినిమాలు కాగా.. రెండు డబ్బింగ్ సినిమాలు.
మంచు విష్ణు హీరోగా నటించిన `జిన్నా`, కార్తి డ్యుయెల్ రోల్ పోషించిన `సర్దార్`, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో నటించిన `ఓరి దేవుడా!`. తమిళ క్రేజీ హీరో శివ కార్తికేయన్ హీరోగా `జాతిరత్నాలు` ఫేమ్ అనుదీప్. కెవి. రూపొందించిన `ప్రిన్స్` సినిమాలు పోటీపడ్డాయి. అక్టోబర్ 21న ఈ నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ఇదే రోజు హాలీవుడ్ మూవీ `బ్లాక్ ఆడమ్ ` కూడా భారీ స్థాయిలో దేశ వ్యాప్తంగా విడుదలైంది.
డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ స్టార్ డ్వైన్ జాన్సన్ హీరోగా నటించి బియూ ఫ్లిన్ తో కలిసి అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన మూవీ ఇది. తెలుగు, డబ్బింగ్ సినిమాకు మించి ఈ హాలీవుడ్ మూవీ అత్యధిక స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ని సాధించి షాకిచ్చింది. భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీ కావడం, కళ్లు చెదిరే వీఎఫ్ ఎక్స్ తో తెరకెక్కిన అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో ప్రేక్షకులు ఈ మూవీ కోసం భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఫస్ట్ డే డీసెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో దీని వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. చాలా రోజుల తరువాత `బ్లాక్ ఆడమ్` లాంటి సినిమా రావడం.. వీకెండ్ లో దీనికి ప్రేక్షకుల తాకిడి మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
ఇదిలా వుంటే ఈ గురువారం విడుదలైన తెలుగు, తమిళ డబ్బింగ్ సినిమాల్లో ఏది పై చేయి సాధించిందన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ముదు నుంచి విశ్వక్ సేన్ హీరోగా విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో నటించిన `ఓరి దేవుడా`, కార్తి నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ `సర్దార్` హాట్ ఫేవంరేట్ లుగా నిలిచాయి. అయితే ఇందులో ఏ సినిమా దీపావళి రేసులో విజేతగా నివలబోతోందనప్నది తెలియాలంటే మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.