డబుల్ రేట్లు - కాంబో ప్యాకులు - బ్లాక్ టికెట్లు

Update: 2019-08-28 01:30 GMT
చాలా కాలం తర్వాత థియేటర్ల వద్ద కిటకిటలాడే రద్దీని సాహో పుణ్యమాని బాక్స్ ఆఫీస్ చూడబోతోంది. మహర్షి తర్వాత చెప్పుకోదగ్గ స్టార్ హీరో సినిమా లేక చాలా నీరసంగా ఉన్న ట్రేడ్ కు రెట్టింపు ఉత్సాహం ఇస్తుందన్న  ధీమా నిర్మాతలు మొదలు ఎగ్జిబిటర్ల దాకా ప్రతిఒక్కరిలోనూ కనిపిస్తోంది. ప్రతి శుక్రవారం మూడు నాలుగు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు విడుదలవుతున్నా ఏదీ కనీస అంచనాలు అందుకునేలా ఉండటం లేదు.

వీక్ డేస్ లో కనీసం రెంట్లు కూడా రాలేక సింగల్ స్క్రీన్ల యజమానులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అందుకే ఐదారు స్క్రీన్లు ఉన్న కాంప్లెక్సుల్లో కేవలం రెండు మూడు నడిచే పరిస్థితి కొన్ని చోట్ల ఉందంటే ఆశ్చర్యం లేదు. మల్టీ ప్లెక్సులు నిర్వహించేవి కార్పొరేట్ సంస్థలు కాబట్టి వాటికి ఆక్యుపెన్సీతో సంబంధం లేకుండా ఏదో ఒక రూపంలో ఓవరాల్ రికవరీ ఉంటుంది. అందుకే మాల్స్ ఖాళీగా ఉన్నా నిండుగా ఉన్నా పెద్దగా పరిగణలోకి తీసుకోవు

ఇప్పుడు సాహో వచ్చాక సీన్ మొత్తం మారిపోతుంది. ఇప్పటికే చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. మూడు రోజులు టికెట్లు దొరకడం కష్టమే అనేలా ఉంది. మరోవైపు ఎపిలో అనుమతులు వస్తున్నాయి కాబట్టి టికెట్ ధరలు డబుల్ అవుతున్నాయి. వంద ధర రెండు వందలు కాబోతోంది. కాంబో ఆఫర్ల పేరుతో ఫుడ్డును తగిలించే వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు.

ఇక బ్లాక్ టికెట్ రాయుళ్ల దందా కూడా ఊపందుకోబోతోంది. ఎంత లేదన్నా రిజల్ట్ తో సంబంధం లేకుండా సాహో హవా ఓ పది రోజులు ఉంటుంది కాబట్టి మార్కెట్ బాగా జరుగుతుంది.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈజీగా నెల దాకా ఇది కొనసాగుతుంది. సో మొత్తానికి సాహో వల్ల ఇంత  గ్యాప్ తర్వాత డబుల్ రేట్లు కాంబో ప్యాకులు బ్లాక్ టికెట్లు దర్శనమివ్వతున్నాయి. సాహోని చూడాలన్న యాంగ్జైటి ముందు వీటిని కేర్ చేసే పరిస్థితిలో మూవీ లవర్స్ లేరు. అదీ సాహో క్రేజ్ కు నిదర్శనం.



Tags:    

Similar News