కంటెంట్ ఉంటేనే కథ చెబుతా

Update: 2017-09-23 17:30 GMT
జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన "జై లవకుశ" చిత్రం ఫైనల్ గా మంచి కలక్షన్లతో దూసుకుపోతోంది. గురువారం విడుదలైన సినిమా ఇప్పటికే మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. మూడవ రోజు కూడా అదే స్థాయిలో వెళుతోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం సినిమాకి హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా అందులోని రావణ పాత్రకు అందరు ఫ్యాన్ అయ్యారు. దర్శకుడు కె.ఎస్ రవీంద్ర కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడనే చెప్పాలి.

అయితే ఈ సినిమా గురించి రవీంద్ర రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. సినిమాలో జై క్యారెక్టర్ నత్తిగా మాట్లాడడం పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ నుంచి తీసుకున్నారని, పూరి ఆ కథని ఎన్టీఆర్ కి కూడా చెప్పారని కొన్ని రూమర్లు అప్పట్లో వచ్చాయి. అయితే ఆ విషయంపై దర్శకుడు స్పందించాడు. దాని గురించి నాకు తెలియదు. నేను మాత్రం బౌండ్ స్క్రిప్ట్ తో తారక్ దగ్గరికి వెళ్ళాను. స్క్రిప్ట్ ప్రకారంగా తారక్ కి ఏది చెప్పానో  అదే సినిమాలో చూపించాను ఒకవేళ అలాంటిది ఉంటే తారక్ నాతో చెప్పేవాడు అని రవీంద్ర చెప్పాడు. ఇక హిరోయిన్స్ పాత్రలు అంతగా ప్రాధాన్యతను ఇవ్వలేదని వచ్చిన కామెంట్స్ కి రవీంద్ర ఈ విధంగా సమాధానాన్ని ఇచ్చాడు. కథ ప్రకారం ఆ పాత్రలు అంతవరకే ఉండాలి. స్క్రిప్ట్ గురించి వారికి తెలుసు. అయినా వారు ఈ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు వారికి థాంక్స్ చెబుతున్నాను అని దర్శకుడు చెప్పాడు.

ఇక సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్యూర్ తర్వాత విజయం దక్కింది ఇప్పుడు ఏం నేర్చుకున్నారు అన్న ప్రశ్నకు రవీంద్ర ఏమన్నాడంటే.. జీవితంలో ప్రతిది నేర్చుకోవాలి. ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా  చాలా నేర్చుకున్నాను. ఎప్పుడైనా సరే అనుభవం కన్నా కంటెంట్ ఉంటేనే విజయం అందుతుంది. అంతే గాని సక్సెస్ ఫెయిల్యూర్ అనే విషయం పనికిరాదని చెప్పాడు. ముఖ్యంగా కథలో కంటెంట్ ఉంటేనే సూపర్ స్టార్ తో అయినా సినిమాను తియ్యగలమని రవీంద్ర వివరిస్తూ.. తను స్క్రిప్ట్ పర్ఫెక్ట్ కంటెంట్ తో ఉంటేనే హీరోలకు కథ చెప్పడానికి వెళతానని చెప్పాడు.
Tags:    

Similar News