తన సినిమా కెరీర్ లోనే మొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా పబ్లిసిటీ కోసం రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నాడు. ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. గంటలకొద్దీ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. సినిమానే కాకుండా, పాలిటిక్స్ - పర్సనల్ లైఫ్ - ఫ్యామిలీ మేటర్స్.. ఇలా ఏది అడిగినా చెప్పేస్తున్నాడు పవన్. మరోవైపు సర్దార్ పబ్లిసిటీ కోసం హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా టీవీ ఛానళ్లలో కూడా కనిపిస్తోంది.
మరి హీరో హీరోయిన్స్ ఇద్దరూ ఇలా పబ్లిసిటీ చేస్తుంటే.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర ఏమయ్యాడనే ప్రశ్న తలెత్తడం సహజం. ఏ సినిమాకి అయినా పబ్లిసిటీలో డైరెక్టర్ కి భాగం ఉంటుంది. ఇక్కడ సర్దార్ గబ్బర్ సింగ్ కోసం బాబీ ముందుకు రావడం లేదు. డైరెక్టర్ వచ్చి ప్రచారం చేయాలని యూనిట్ కూడా అనుకోవడం లేదు. సినిమా తీస్తున్నప్పటి నుంచి సర్దార్ యూనిట్ లో చాలామందితో బాబీకి విబేధాలు ఏర్పడ్డాయి. వీటి కారణంగానే సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత కూడా షకలక శంకర్ తో వివాదాన్ని ఆపేందుకు పవన్ కళ్యాణ్ చొరవ చూపాల్సి వచ్చింది. ఇప్పుడు మూవీ నిరుత్సాహపరచిన తర్వాత... తను కూడా మీడియా ముందుకు వచ్చేందుకు బాబీ ఇష్టపడ్డంలేదు. ఇటు సర్దార్ యూనిట్ నుంచి కూడా పిలుపు లేకపోవడంతో.. అసలు బాబీని పట్టించుకునే వాళ్లే లేకపోయారు.