ద‌సరా కానుకగా థియేటర్స్ లో విడుదలయ్యే ఫస్ట్ మూవీ 'బోగ‌న్‌'...?

Update: 2020-10-09 09:45 GMT
కోలీవుడ్ స్టార్ హీరో 'జ‌యం' ర‌వి - సీనియర్ నటుడు అర‌వింద్‌ స్వామి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ''బోగ‌న్‌''. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి తీసుకురాబోతున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్.ఆర్‌.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై 'బోగ‌న్' చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. హన్సిక మొత్వానీ హీరోయిన్ గా నటించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ కి ల‌క్ష్మ‌ణ్ దర్శకత్వం వహించారు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చారు. 'జయం' రవి - అర‌వింద్‌ స్వామి కాంబోపై ఉన్న క్రేజ్ దృష్ట్యా 'బోగ‌న్‌' సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న 'బోగ‌న్' చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ ఇటీవల విడుదల చేయబడి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంది.

కాగా, అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ ఓపెన్ చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే సినిమా సందడి మొదలు కానుంది. ఇప్పటి వరకు ఏ సినిమా ముందుగా రిలీజ్ చేస్తారనేది ప్రకటించినప్పటికీ.. థియేట‌ర్స్ ఓపెన్ అయితే మాత్రం మొట్ట మొద‌టిగా డ‌బ్బింగ్ సినిమాతోనే ప్రేక్ష‌కులు ఎంటర్టైన్ అవ్వ‌బోతున్నారని తెలుస్తోంది. ''బోగ‌న్'' సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్క‌వగా ఉండ‌టంతో బీ, సీ సెంటర్స్ లో ఆడియెన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుందని గిల్డ్ నిర్మాత‌లంతా ఓ ఏకాభిప్రాయానికి వచ్చారట. అందులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి నిర్మాత రామ్ త‌ళ్లూరి నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డంతో ఈ ద‌సరా పండుగకి వ‌చ్చే కొత్త సినిమా ''బోగ‌న్'' అనే టాక్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి థియేటర్స్ తెరిచిన తర్వాత ముందుగా ఏ సినిమా రిలీజ్ చేస్తారో చూడాలి.
Tags:    

Similar News