దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన ‘మల్లీశ్వరీ’..!

Update: 2022-10-25 00:30 GMT
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తాజా చిత్రం ‘ఫోన్ భూత్’. నవంబర్ 4న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే కత్రినా కైఫ్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

కత్రినా కైఫ్ తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. విక్టరీ వెంకటేష్ కు జోడీగా ‘మల్లీశ్వరీ’లో నటించింది. 2004లో వచ్చిన ఈ సినిమా కత్రినా కైఫ్ కు బ్లాక్ బస్టర్ హిట్టిచ్చింది. 2005లో బాలకృష్ణతో కలిసి ‘అల్లరి పిడుగు’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మాత్రం ఆమెకు నిరాశను మిగిల్చింది.

మలయాళంలో ‘బలరాం వర్సెస్ తారాదాస్’ అనే సినిమాలో నటించింది. ఇకపోతే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల కంటే కూడా సౌత్ సినిమాలనే నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ చెందిన స్టార్ హీరోలంతా సౌత్ ఇండస్ట్రీలపై ఫోకస్ పెడుతున్నారు.

బాలీవుడ్ కండల వీరుడు ‘సల్మాన్ ఖాన్’ మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీలో నటించి సౌత్ పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. అలాగే అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ పాత్ర చేసి ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ సైతం వీలుచిక్కినప్పుడల్లా సౌత్ సినిమాల్లో నటిస్తోంది.

మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వం’లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించింది. ఈ సినిమాపై కత్రినా కైఫ్ ప్రశంసలు కురించింది. తన జీవితంలో ఇంతటి అద్భుతమైన చిత్రం చూడలేదని కితాబిచ్చింది. మణిరత్నం సినిమా తీసిన విధానం, ఎఆర్.రహ్మన్ సంగీతం ఆకట్టుకున్నట్లు చెప్పారు. పనిలో పనిగా సౌత్ ఇండస్ట్రీపై తన మనసస్సులోని మాటలను కత్రినా కైఫ్ వెల్లడించారు.

తనకు భాష అనేది పెద్ద సమస్య కాదని.. మంచి కథతో దర్శకులు వస్తే సౌత్ లో సినిమా చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనని ప్రకటించింది. కాగా విక్కీ కౌశాల్ తో వివాహం తర్వాత కత్రినా నటించిన తొలి సినిమా ‘ఫోన్ బూత్’. హర్రర్-కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీలో సిద్ధాంత్ చతుర్వేది.. ఇషాన్ ఖట్టర్ నటించారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News