బికినీలో టూమ‌చ్ చేస్తున్న ఎక్స్ బ్యూటీ

Update: 2020-05-03 02:30 GMT
బాలీవుడ్ బ్యూటీ మినిషా లాంబా పేరు హిందీ సినిమాలు చూసేవారికి తప్ప  మిగతావారికి తెలిసి ఉండే అవకాశం తక్కువే.   'కార్పొరేట్'.. 'రాకీ: ది రెబెల్'.. 'అంటోనీ కౌన్ హై'.. 'హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్' .. 'భేజా ఫ్రై' లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపే సంపాదించుకుంది. సినిమాలతో పాటుగా అప్పుడప్పుడు టీవీ రియాలిటీ షోలను కూడా ఒక చూపు చూస్తుంటుంది. మిగతా బాలీవుడ్ భామల తరహాలోనే సోషల్ మీడియాపై గ్లామరాస్త్రం ప్రయోగించి నెటిజన్ల ప్రాణాలు తీస్తుంటుంది.

తాజాగా మినిషా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఆ ఫోటోకు "నా ఫోటోకు సూట్ అయ్యే ఓ కలర్ ఫుల్ డ్రింక్ ఇవ్వమని అడిగాను. అదేమో వింతగా అనిపించింది.  కానీ మొదటి సిప్ చేసిన తర్వాత నా మొహంలో వచ్చిన చిరునవ్వు.. అదో నిజమైన సంతోషం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఫోటోలో వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ బికినీ ధరించి.. చేత్తో అదేదో పేరు తెలియని డ్రింక్ పట్టుకుని సూపర్ స్మైల్ ఇచ్చింది.  ఈ ఫోటో వ్యవహారం చూస్తుంటే ఇప్పటిది కాదన్న విషయం మీకు అర్థం అవుతోంది కదా.  ఏదైతేనేం.. బికినీకి మ్యాచింగ్ గా కలర్ ఫుల్ డ్రింక్ అంటే టూ మచ్ అనిపించడం లేదూ?

అయినా బికినీలకు కాలాలతో పనేముంది.  ఏ ఫోటో అయినా సరే భూత కాలాన్నే సూచిస్తుంది.  ఆ క్షణం మళ్ళీ రాదు.  భామలు ఈ బికినీల ఫోటోలు షేర్ చెయ్యడం చూస్తుంటే చాలామంది స్విమ్మింగ్ పూల్స్.. బీచులను తెగ గుర్తుచేసుకుంటున్నారని అనిపిస్తోంది. ఈ  ఫోటోకు కొందరు నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. "బహుత్ ఖూబ్".. "బికినీ అంబాజిడర్".. "ఎల్లో ఎల్లో బికినీ ఫెల్లో" అంటూ స్పందించారు. ఇక సినిమాల విషయానికి వస్తే సంజయ్ దత్ సినిమా 'భూమి'(2017) లాస్ట్ ఫిలిం. ఆ సినిమా తర్వాత మరో సినిమా ఆఫర్ రాలేదు.
Tags:    

Similar News