విజయేంద్ర ప్రసాద్... ప్రస్తుతం బాలీవుడ్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారిన పేరు. బాహుబలి, బజరంగి భయిజాన్ సినిమాల కథ రచయితగా టాక్ అఫ్ ది టౌన్ గా మారారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీసును శాసిస్తున్నాయి. దీంతో విజయేంద్ర ప్రసాద్ కోసం బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. జాతీయ మీడియా ఆయన్ని పొగడ్తలతో ముంచేస్తోంది. అయితే విజయేంద్ర ప్రసాద్ కు బాలీవుడ్ కలిసివస్తోందా? అన్నది టాలీవుడ్ వర్గాలలో జరుగుతున్న చర్చ.
ఒకసారి గతంను గుర్తుకు తెచ్చుకుంటే సౌత్ నుంచి బాలీవుడ్కు వెళ్ళిన వారిలో సక్సెస్ అయిన హీరోలు కాని , రైటర్లు కాని , హీరోయిన్లు కాని చాలా తక్కువనే చెప్పాలి. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీరంతా బాలీవుడ్ సినిమాలు చేసిన వాళ్ళే, రీసెంట్ గా రామ్ చరణ్ కుడా జాంజీర్ చేసి బోల్తాపడ్డాడు. అలాగే సౌత్ నుంచి వెళ్ళిన హీరోయిన్లు త్రిష, తమన్నా, కాజల్ లు హిట్లు లేక మళ్ళీ వెనక్కి వచ్చారు. అలాగే వరుసగా మూడు వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఆసిన్, ఇప్పుడు సినిమా ఆఫర్లు లేక బాలీవుడ్ చుట్టూ చక్కర్లు కొడుతోంది.
ప్రభుదేవా బాలీవుడ్ లో దర్శకుడిన అడుగు పెట్టిన వెంటనే వరుస సినిమాలతో వంద కోట్లు కలెక్ట్ చేసి హాట్ దర్శకుడిగా మారారు. కానీ ప్రస్తుతం వరుస ఫ్లాప్ లు ఎదుర్కొని, ఛాన్స్ లు లేక సౌత్ వైపు అడుగులు వేస్తున్నాడు. అయితే బజరంగి భయిజాన్ తో బాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ సౌత్ కి కొత్త బాటలు పరుస్తాడా ? లేక అందరిలాగే రెండు మూడు హిట్లు ఇచ్చి వెన్నక్కి వస్తాడా? అన్నది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.