సౌత్ సినిమా ఆధిపత్యం క్రమంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న క్రమంలో సాహోకు వచ్చిన డివైడ్ టాక్ బాలీవుడ్ క్రిటిక్స్ కు లడ్డు లాగా దొరికింది. అద్భుతంగా తెరకెక్కిన కబీర్ సింగ్ మీదే అక్కసు వెళ్ళబోసుకున్న ఈ బ్యాచ్ కు ఇప్పుడు సాహో అనుకోని వరంగా దొరికింది. అంతే తమ రివ్యూస్ లో రిపోర్ట్స్ లో రేటింగ్స్ మరీ దారుణంగా ఇచ్చేసి ఉన్నదాని కంటే చాలా తక్కువ స్థాయిలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
సాహో చాలా విషయాల్లో అంచనాలు అందుకోలేకపోయిన మాట వాస్తవం. ఇది అందరూ ఒప్పుకుంటున్నారు. కాని టెక్నికల్ గా స్టాండర్డ్ పరంగా ఏదో భారీ ప్రయత్నమైతే జరిగింది. దర్శకుడు సుజిత్ దానికి న్యాయం చేయలేకపోయాడు. ఇలాంటి పరాజయాలు ప్రతి హీరో కెరీర్ లోనూ ఉంటాయి. కాని అక్కడి మీడియా మాత్రం సాహోని ఓ రేంజ్ లో చెడుగుడు ఆడటం ప్రభావం చూపేలా ఉంది
ప్రసిద్ధ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్ష్ ఏకంగా హాఫ్ రేటింగ్ ఇచ్చి ఇది భరించలేని సినిమాగా పేర్కొనడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కనీసం సింగల్ డిజిట్ కూడా ఇవ్వకపోవడం పట్ల డార్లింగ్ ఫ్యాన్స్ హర్ట్ అయిపోయి కామెంట్స్ లోనే నిలదీశారు. ప్రముఖ మీడియా సంస్థలు సైతం 1 నుంచి 2 మధ్యలోనే రేటింగ్ ఇవ్వడం బట్టి చూస్తే సాహోకి అక్కడ ఎంత బ్యాడ్ రిసెప్షన్ దక్కిందో అర్థం చేసుకోవచ్చు. ఒకరిద్దరు తప్ప మొత్తం బాలీవుడ్ క్యాస్టింగే ఉన్నా కూడా ప్రభాస్ ని ఎక్కువగా టార్గెట్ చేయడం గమనార్హం. మొత్తానికి కంటెంట్ వీక్ గా ఉన్న కారణంగా సాహోని ఫుల్ గా క్రిటిక్ జోన్ లో పడేసి ఆడుకుంటున్నారు అక్కడి విశ్లేషకులు.